4 నెలల గరిష్టానికి బంగారం ధరలు, సిల్వర్ రేట్లు కూడా జంప్
బంగారం, వెండి ధరలు నేడు (మే 24, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలు పెరుగుతున్నాయి. పసిడి నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. గత కొద్దిరోజులుగా బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు పతనమయ్యాయి. అంతకుముందు బంగారానికి ప్రత్యామ్నాయ పెట్టుబడిగా క్రిప్టోను చాలామంది ఎంచుకున్నారు. ఇప్పుడు క్రిప్టో పతనం నేపథ్యంలో మళ్లీ పసిడి వైపు చూస్తున్నారు. ద్రవ్యోల్భణ ఆందోళనల నేపథ్యంలో అమెరికా డాలర్ బలహీనపడటం కూడా బంగారం వ్యాల్యూ పెరగడానికి దోహదపడింది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.136.00 (0.28%) పెరిగి రూ.48540.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,450.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,552.00 గరిష్టాన్ని, రూ.48,450.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.181.00 (0.37%) పెరిగి రూ.49070.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,053.00 వద్ద ప్రారంభమై, రూ.49,080.00 గరిష్టాన్ని, రూ.48,980.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,500కు దిగువన వెండి
వెండి ఫ్యూచర్ ధరలు నేడు పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.444.00 (0.62%) పెరిగి రూ.71493.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,517.00 వద్ద ప్రారంభమై, రూ.71,605.00 గరిష్టాన్ని, రూ.71,404.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.409.00 (0.57%) పెరిగి రూ.72620.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,640.00 ప్రారంభమైన ధర, రూ.72,675.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,566.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు భారీగా పెరిగాయి. 1900 డాలర్ల దిశగా పరుగెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 8.55 (0.46%) డాలర్లు పెరిగి 1,885.25 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,880.90 - 1,887.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.316 (+1.15%) డాలర్లు పెరిగి 27.802 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.570 - 27.867 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications