బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. క్రితం వారం రూ.రూ.50,305 వద్ద క్లోజ్ అయిన ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.450 వరకు పెరిగి రూ.50,700ను క్రాస్ చేసింది. కోవిడ్ వ్యాక్సీన్, వ్యాక్సినేషన్ కారణంగా పసిడి ధరలు గత నెల చివరలో రూ.47,500కి తగ్గాయి. ఆ తర్వాత మళ్లీ పైపైకి కదులుతున్నాయి. గతవారం రూ.50,000ను క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.51,000 దిశగా పయనిస్తోంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,500 తక్కువగా ఉంది. యూఎస్ ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ అంశాలు పసిడి, ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

భారీగా పెరిగిన బంగారం ధరలు
సోమవారం (డిసెంబర్ 21) ప్రారంభ సెషన్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.442.00 (0.88%) పెరిగి రూ.50746.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,515.00 వద్ద ప్రారంభమై, రూ.50,761.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,515.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.456.00 (0.91%) పెరిగి రూ.50805.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,746.00 వద్ద ప్రారంభమై, రూ.50,815.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,728.00 కనిష్టాన్ని తాకింది.

రూ.2వేలకు పైగా పెరిగిన బంగారం
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,000కు పైగా పెరిగి రూ.70,00ను దగ్గరకు వచ్చింది. ఓ సమయంలో ఈ మార్కును కూడా క్రాస్ చేసింది. వెండి కిలో రూ. 2,035.00 (3.00%) పెరిగి రూ.69942.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,958.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,298.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,958.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ రూ.2,194.00 (3.20%) పెరిగి రూ.70850.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,674.00 వద్ద ప్రారంభమై, రూ.70,900.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,674.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడా జంప్
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 13.75 (+0.73%) డాలర్లు పెరిగి 1,902.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,888.10 - 1,905.55 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో బంగారం 1,888.90 వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 26.28 శాతం పెరిగింది. చాలా రోజుల తర్వాత పసిడి 1900 డాలర్లను దాటింది.
వెండి ఫ్యూచర్స్ 0.885 (+3.40%) డాలర్లు పెరిగి 26.918 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.005 - 26.918 డాలర్ల మధ్య కదలాడింది. క్రితం సెషన్లో 26.033 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి 54.16 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. పసిడి ధరలపై ప్రభావం చూపని ఇరాన్ యుద్ధం..ఇప్పుడు ఏం చేయాలంటే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

భవిష్యత్తులో బంగారం అయిపోతుందా.. మైనింగ్ తవ్వకం తరువాత ఏమి మిగలదా..పసిడి కొరతపై క్లారిటీ ఇదిగో..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పతనం.. ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి

Gold prices: యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు? ఇన్వెస్టర్ల భయం ఇదే..

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..



Click it and Unblock the Notifications