పడిపోయిన బంగారం ధర, హైదరాబాద్‌లో ఎంతంటే?
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు రూ.55,230గా నమోదయ్యాయి. 24 క్యారెట్ల బంగారం ధరలు ఈ రోజు స్పాట్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గాయి. ముంబై మార్కెట్‌లో రూ.600కు పైగా తగ్గి రూ.55,515 పలికింది. హైదరాబాద్‌లో రూ.300కు పైగా తగ్గి రూ.58,400 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 0.34 శాతం పడిపోయి 2,029 డాలర్లకు పడిపోయింది. నెల రోజుల క్రితం పసిడి ధరలు 1,893 డాలర్లు పలకగా, నాటి నుండి 6.67 శాతం పెరిగింది. సిల్వర్ ట్రాయ్ ఔన్స్ 28 డాలర్లుగా ఉంది.
గత వారం చివరి రోజు కామెక్స్‌లో, ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు తగ్గాయి. 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 1.89 శాతం తగ్గి రూ.54,789 పలికింది. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.74,160 పలికింది. దేశంలో బంగారం వినియోగం భారీగా ఉంటుంది. సోమవారం ఆసియా ప్రారంభ ట్రేడింగ్ సెషన్‌లో పసిడి ఔన్స్ 2,027 డాలర్లకు పడిపోయింది. రెండు నెలల్లో ధర వరుసగా పడిపోవడం ఇదే మొదటిసారి. కనిష్టానికి తగ్గలేదు కానీ, ఇదివరకు స్వల్పంగా తగ్గిన ధర ఇప్పుడు ఎక్కువగా క్షీణించింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జూలై నెలలో పదకొండు శాతానికి పైగా పెరిగాయి. అయితే ఆగస్ట్‌లో మాత్రం బంగారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా డాలర్ రెండేళ్ల కనిష్టం నుండి తిరిగి పుంజుకుంటుండటం. అమెరికాలో నిరుద్యోగిత రేటు భారీగా తగ్గి, 10.2 శాతంగా ఉండటం.


Click it and Unblock the Notifications