Gold Prices Today: బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయంటే
అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే వార్తల నేపథ్యంలో తొలుత పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. కానీ అంతలోనే పరుగు పెడుతోంది. ద్రవ్యోల్భణ ఆందోళనలు, అమెరికా జాబ్ డేటా వంటి అంశాలు పసిడి పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల్లోనే ధరలు దాదాపు వెయ్యి పెరిగింది. గతవారం వరకు రూ.48,000కు దిగువన ఉన్న పసిడి, ప్రస్తుతం ఈ మార్కును దాటింది.

బంగారం ధరలు నేడు
బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేటి ప్రారంభ సెషన్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2 పెరిగి రూ.48,230 వద్ద ట్రేడ్ అయింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.6 ఎగిసి రూ.48,380 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1821 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,820.95 - 1,823.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల గరిష్టం 1922.40 డాలర్లు, కనిష్టం 1682.40 డాలర్లు. క్రితం సెషన్లో 1,821.80 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో బంగారం 0.16 శాతం క్షీణించింది.

నిన్నటి ముగింపు..
బంగారం ధరలు క్రితం సెషన్‌లోను భారీగా పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.311కు పైగా పెరిగి రూ.48,235 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.321 పెరిగి రూ.48,400 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ అయితే ఏకంగా రూ.1200 వరకు లాభపడింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1194 ఎగిసి రూ.62,043 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1156 లాభపడి రూ.62,784 వద్ద ముగిసింది.

వెండి ధరలు
నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు మాత్రం స్వల్పంగా తగ్గాయి. నిన్న రూ.1200 వరకు పెరిగిన పసిడి నేడు ప్రారంభ సెషన్లో రూ.200కు పైగా తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.209 తగ్గి రూ.61,826 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.198 తగ్గి రూ.62,600 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో 0.224 డాలర్లు ఎగిసి 22.852 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications