Gold Prices Today: రూ.51,000 బంగారం ధరలు, వెండి రూ.61,000కు పైన
బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. గతవారం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో రూ.50,000 దిగువకు వచ్చిన గోల్డ్ ఫ్యూచర్ ధరలు, ఆ తర్వాత ఈ మార్కును దాటాయి. క్రితం సెషన్‌లోను గోల్డ్ ఫ్యూచర్ ధరలు పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.163 పెరిగి రూ.50,992 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.167 పెరిగి రూ.51,190 వద్ద ముగిశాయి. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గి రూ.61,400 దిగువన ముగిశాయి.
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు కూడా పెరిగాయి. అయితే ఇది అతి స్వల్పమే. నేడు (24 మే, 2022) ప్రారంభ సెషన్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.13 పెరిగి రూ.50,920 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.41 పెరిగి రూ.51,135 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,300కు పైన ఉంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5300 తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000 పోలిస్తే రూ.18000కు పైగా తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1850 డాలర్లు క్రాస్ చేసింది. ఈ వార్త రాసే సమయానికి దాదాపు 6 డాలర్లు లాభపడి 1853.5 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.040 డాలర్లు ఎగిసి 21.764 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి ధర 1.40 శాతం తగ్గగా, సిల్వర్ ఫ్యూచర్స్ 21.50 శాతం తగ్గింది.


Click it and Unblock the Notifications