గత నెల ఆగస్ట్ 7వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకున్న అనంతరం, వరుసగా నాలుగు వారాలుగా ధరలు కాస్త తగ్గుముఖమే పట్టాయి. ధరలు తగ్గుముఖం పట్టడంతో డీలర్లు కూడా డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు. వరుసగా నాలుగో వారం వ్యాపారస్తులు డిస్కౌంట్ ప్రకటించారు. ధరల పెరుగుదల, కరోనా మహమ్మారి నేపథ్యంలో బయటకు వెళ్లకపోవడం వంటి వివిధ కారణాలతో భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గడం కూడా ఆఫర్లు ఇవ్వడానికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు, నేడు (సెప్టెంబర్ 13) కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్, విశాఖల్లో ధరలు ఎలా ఉన్నాయంటే
బులియన్ మార్కెట్లో డిమాండ్ లేమి కారణంగా పసిడి, వెండి ధరలు ఈ రోజు పడిపోయాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.350కి పైగా క్షీణించి రూ.53,350 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.48,900కు దిగి వచ్చింది. ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు రూ.400కు పైగా తగ్గి 24 క్యారెట్ల పసిడి రూ.54,380, 22 క్యారెట్ల బంగారం రూ.49,850 పలికింది. వెండి రూ.650కి పైగా తగ్గి కిలో రూ.67,900కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ఓ సమయంలో రూ.59,000 పలికింది. ఇప్పుడు రూ.53,500కు దిగువన ఉంది. అంటే నెల రోజుల్లో రూ.5,500 వరకు తక్కువగా పలుకుతోంది.

అయినా బంగారం ధర రూ.50వేల పైనే...
బంగారం ధర ఇప్పటికీ రూ.50వేలకు పైనే ఉంది. ఎంసీఎక్స్‌లో రూ.51వేలకు పైన, బయటి మార్కెట్లో రూ.54వేలకు అటు ఇటుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భౌతిక బంగారం కొనుగోలు కూడా ఆశించినంతగా లేదు. బంగారం ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా అనే డైలమాలో చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. వ్యాక్సీన్ వస్తే మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు.

ధరల తగ్గుదల..
శుక్రవారం నాటికి ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు 10 గ్రాములకు రూ.51,280కి దిగి వచ్చింది. శుక్రవారం రూ.500 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతో ఈ ప్రభావం పడింది. వెండి కిలో కూడా రూ.1,056 తగ్గి కిలో రూ.67,926 పలికింది. పసిడి గత నెలలో రూ.56,200 పైన, వెండి రూ.79 వేల సమీపానికి చేరుకున్న విషయం తెలిసిందే. నాటి ధరతో పోలిస్తే బంగారం ఇప్పటికీ రూ.5,000 వరకు తక్కువగా ఉంది. వెడి కిలో రూ.11,000 వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం పడిపోయి ఔన్స్ 1950 డాలర్లు పలికింది. తక్కువ వడ్డీ రేట్లు, అమెరికా డాలర్ బలహీనపడటం, ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం, కరోనా కేసులు, వ్యాక్సీన్ అంశాలు పసిడిపై ప్రభావం చూపుతాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications