For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, రూ.1000 తగ్గిన బంగారం ధరలు, వెండి రూ.1700 డౌన్

|

బంగారం ధరలు భారీగా క్షీణించాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వార్తల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లోను ధరలు ఏకంగా 1800 డాలర్ల స్థాయికి పడిపోయాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నెల కనిష్టానికి పడిపోయింది. ఓ సమయంలో పది గ్రాముల బంగారం రూ.47,420కు కూడా పడిపోయింది. వెండి ధరలు కిలో రూ.69,556కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 1808 డాలర్ల వద్ద, వెండి 27 డాలర్ల దిగువకు పడిపోయింది.

భారీగా తగ్గిన బంగారం ధరలు

భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.991.00 (2.04%) తగ్గి రూ.47515.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,250.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,250.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.47,420.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.982.00 (2.01%) తగ్గి రూ.47830.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,137.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,150.00 గరిష్టాన్ని, రూ.47,750.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.350 జంప్

వెండి రూ.350 జంప్

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.1,710.00 (2.39%) తగ్గి రూ.69758.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,000.00 వద్ద ప్రారంభమై, రూ.71,000.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.69,556.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,714.00 (2.36%) తగ్గి రూ.70907.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,500.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,569.00 గరిష్టాన్ని, రూ.70,700.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 55.65 (2.99%) డాలర్లు తగ్గి 1,805.95 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,805.95 - 1,826.20 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.984 (3.54%) డాలర్లు తగ్గి 26.828 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.848 - 27.317 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

గుడ్‌న్యూస్, రూ.1000 తగ్గిన బంగారం ధరలు, వెండి రూ.1700 డౌన్ | Gold prices today: Gold prices down RS 1000 today

A decrease of 2.04 percent in MCX future gold prices since morning, taking the value to Rs 47,515 from Rs 48,250.
Story first published: Thursday, June 17, 2021, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X