ముంబై: ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోమవారం (నవంబర్ 16) క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంత్రం డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం, వెండి ధరలు 0.9 శాతం తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి ధరలు ఇప్పటికీ రూ.5,300 తక్కువగా ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఇటీవల దీపావళి, ధనత్రయోదశి సమయంలోను గోల్డ్ కాయిన్స్ పైన పెట్టుబడులే ఎక్కువగా పెట్టారు. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సీన్ పైన సానుకూల ప్రకటనల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గుతోంది.

పసిడి ధర తగ్గుదల
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.216.00 (-0.42%) క్షీణించి రూ.50,770 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,931.00 వద్ద ప్రారంభమై, రూ.50,985.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,150.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.189.00 (-0.37%) క్షీణించి రూ.50,849.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,038.00 వద్ద ప్రారంభమై, రూ.51,038.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,241.00 వద్ద కనిష్టాన్నని తాకింది.

రూ.500 క్షీణించిన వెండి
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.500కు పైగా తగ్గింది. డిసెంబర్ ఫ్యూచర్ రూ.583.00 (-0.91%) క్షీణించి రూ.63,218.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,010.00 ప్రారంభమైన ధర, రూ.64,089.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,160.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.442.00 (-0.68%) తగ్గి రూ.65,023.00 వద్ద ట్రేడ్ అయింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65,762.00 ప్రారంభమై, రూ.65,762.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,100.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.13 శాతం ఎగిసి 1,888.65 డాలర్లు పలికింది. క్రితం సెషన్లో 1,886.20 డాలర్ల వద్ద ముగిసిన పసిడి, నేడు 1,862.00 - 1,897.70 మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 26.33 శాతం పెరిగింది.
వెండి 0.29 శాతం క్షీణించి ఔన్స్ ధర 24.703 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.775 డాలర్ల వద్ద ముగిసిన సిల్వర్ తాజా సెషన్లో 24.255 - 25.155 డాలర్లు పలికింది. ఏడాదిలో 45.32 శాతం పెరిగింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications