బంగారం ధరలు ఇటీవల తగ్గుతున్నాయి. వినాయక చవితి పర్వదినం సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్లకు సెలవు రోజు. ఇటీవల రూ.48,000 స్థాయికి చేరుకున్నట్లుగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,000 దిగువకు పడిపోయాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ క్లోజ్ ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్ ఓపెన్ ఉంటుంది. అక్కడ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 1800 డాలర్ల పైకి చేరుకున్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 0.100 (+0.41%) డాలర్లు క్షీణించి 24.277 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 5 డాలర్లు పెరిగి 1804 డాలర్లను తాకింది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో శుక్రవారం (సెప్టెంబర్ 10) గోల్డ్ ఫ్యూచర్స్ రూ.65 క్షీణించి రూ.46,973 వద్ద ముగిసింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.60 తగ్గి రూ.47,147 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.33.00 క్షీణించి రూ.64150.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.57.00 తగ్గి రూ.64942.00 వద్ద ట్రేడ్ అయింది.

యూఎస్ పేరోల్ డేటా నేపథ్యంలో ఆగస్ట్ 6వ తేదీన బంగారం ధరలు ఒకేరోజు ఏకంగా 2.3 శాతం మేర క్షీణించాయి. అయితే ఇప్పుడు మాత్రం పే రోల్ డేటా అనంతరం బంగారం ఊగిసలాటలో ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం మూడు వారాల కనిష్టం వద్ద ఉన్నాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.9100 వరకు తక్కువగా ఉన్నాయి. ఇక వెండి ఈ వారంలో రూ.65వేల స్థాయి నుండి రూ.61వేల స్థాయికి వచ్చి మళ్లీ పెరిగింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications