బంగారం ధరలు నేడు (సోమవారం, మార్చి 29) భారీగా తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల పసిడి ఏకంగా 1.8 శాతం క్షీణించి రూ.44,000 దిగువకు పడిపోయింది. వెండి ధరలు కూడా రూ.700కు పైగా క్షీణించి రూ.64,000 స్థాయికి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారీగానే తగ్గాయి. అయినప్పటికీ 1700 డాలర్లకు పైనే ఉంది. వెండి ఔన్స్ ధర 24వేల డాలర్ల స్థాయిలోనే కదలాడుతోంది. గత కొద్దివారాలుగా రూ.45,000కు దిగువనే ఉన్న పసిడి ధరలు, ఇప్పుడు రూ.44 వేల దిగువకు కూడా వచ్చాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,400 తక్కువగా ఉంది.

భారీగా తగ్గిన పసిడి
గోల్డ్ ఫ్యూచర్ నేడు (మార్చి 29, 2020) సాయంత్రం సెషన్‌లో ఉదయం కంటే మరింతగా క్షీణించింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.792.00 (-1.77%) క్షీణించి రూ.43850.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,520.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,550.00 వద్ద గరిష్టాన్ని, రూ.43,732.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,600 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.361.00 (-0.80%) తగ్గి రూ.44750.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,972.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,060.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,600.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.700 తగ్గిన వెండి ధర
వెండి ధరలు నేడు సాయంత్రం సెషన్లో రూ.700కు పైగా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.721.00 (-1.11%) తగ్గి రూ.64084.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,311.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,620.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,700.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.728.00 (-1.11%) తగ్గి రూ.64954.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,527.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,601.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

27 డాలర్లు తగ్గిన పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. గోల్డ్ ఓ సమయంలో 27 డాలర్ల వరకు పడిపోయింది. ఈ వార్త రాసే సమయానికి ఫ్యూచర్స్ ఔన్స్ 18.35 (-1.06%) డాలర్లు తగ్గి 1,713.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,705.75 - 1,733.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిగువకు వచ్చింది. ఔన్స్ ధర 0.396
(-1.58%) డాలర్లు తగ్గి 24.707 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.483 - 25.145 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications