భారీగా తగ్గిన బంగారం ధరలు, వెండి రూ.1000కి పైగా డౌన్
ముంబై: గత ఐదారు సెషన్లుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.50వేలను క్రాస్ చేసిన పసిడి నేడు 49,700 దిగువకు వచ్చింది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి ధరలు ఇప్పటికీ రూ.6,600 తక్కువగా ఉన్నాయి. నేడు మధ్యాహ్నం సెషన్ సమయానికి దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.434.00 (-0.87%) క్షీణించి రూ.49675.00 వద్ద ట్రేడ్ అయింది.
రూ.49,850.00 వద్ద ప్రారంభమై, రూ.49,850.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,634.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ ధర రూ.341 తగ్గి రూ.49,788 వద్ద ట్రేడ్ అయింది.

వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ.1,068.00 (-1.64%) తగ్గి రూ.64124.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65వేలకు పైగా పలికిన వెండి నేడు క్షీణించింది. రూ.64,521.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,542.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,050.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లను గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 11.30 (-0.60%) డాలర్లు తగ్గి 1,863.80 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,859.75 - 1,875.40 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో బంగారం 25.56 శాతం పెరిగింది. వెండి ఫ్యూచర్స్ -0.334 (-1.35%) తగ్గి 24.402 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఏడాదిలో 46.52 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications