For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.51వేల దిగువకు బంగారం ధరలు, రూ.2500 తగ్గిన వెండి

|

పసిడి ధరలు బుధవారం(అక్టోబర్ 7) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్న పెరిగిన ధరలు వరుసగా రెండు రోజులుగా తగ్గుతున్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో నిన్న ప్రారంభంలో పెరిగిన పసిడి, వెండి ధరలు చివరకు తగ్గాయి. నేడు ప్రారంభ సెషన్‌లోనే క్షీణించాయి. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200, వెండి రూ.79వేల వరకు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుండి బంగారం రూ.5,500కు పైగా, వెండి కిలో రూ.20వేలకు పైగా తగ్గింది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్: HDFCతో భారీ డిస్కౌంట్అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్: HDFCతో భారీ డిస్కౌంట్

రూ.51వేల దిగువకు బంగారం, రూ.2500 తగ్గిన వెండి

రూ.51వేల దిగువకు బంగారం, రూ.2500 తగ్గిన వెండి

ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.9 శాతం క్షీణించి రూ.50,088 పలికింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ 1.5 శాతం క్షీణించి రూ.59,658 పలికింది. నిన్నటి సెషన్‌‍లో బంగారం ధరలు 0.32 శాతం క్షీణించి, వెండి 2.3 శాతం తగ్గాయి. నిన్న కిలో వెండి రూ.1,450 పలికింది. వెండి ధర రెండు రోజుల్లో రూ.2,500 పైగా తగ్గింది. ఆగస్ట్ 7వ తేదీ నుండి బంగారం ధరలు భారీగా క్షీణించాయి. అయితే వివిధ కారణాలతో రెండు వారాలుగా మళ్లీ వేగంగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గిన ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గిన ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1877.15 డాలర్ల వద్ద స్థరంగా ఉంది. అయితే అంతకుముందు సెషన్‌లోనే 2 శాతం క్షీణించింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం తగ్గి 1,889 పలికింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీ ఇండెక్స్‌లో డాలర్ వ్యాల్యూ 0.2 శాతం ఎగిసింది. దీంతో బంగారంపై ఒత్తిడి మరింతగా తగ్గింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ 0.7 శాతం పెరిగి 23.25 డాలర్లకు, ప్లాటినమ్ 1 శాతం పెరిగి 856.51 డాలర్లకు పెరిగింది. పల్లాడియం 0.1 శాతం తగ్గి 2,339.81 డాలర్లు పలికింది.

స్థిరంగా ధరలు

స్థిరంగా ధరలు

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఈ రోజు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.52,850, 22 క్యారెట్ల బంగారం రూ.48,450 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.53,350, 22 క్యారెట్ల బంగారం రూ.49,400 పలికింది.

English summary

రూ.51వేల దిగువకు బంగారం ధరలు, రూ.2500 తగ్గిన వెండి | Gold prices today fall sharply, silver rates crash Rs 2,500 in two days

Gold prices in India fell for the second day, tracking a decline in global rates after US President Donald Trump suspended stimulus talks with Democrats. On MCX, December gold futures were down 0.9% to ₹50,088 per 10 gram while silver futures fell 1.5% to ₹59,658.
Story first published: Wednesday, October 7, 2020, 12:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X