బంగారం ధర భారీగా తగ్గింది, రూ.48,000 స్థాయికి: వెండి నిన్న భారీ షాక్, నేడు ఊరట
ముంబై: బంగారం ధరలు వరుసగా రెండో రోజు క్షీణించాయి. నిన్న భారీగా తగ్గిన పసిడి, నేడు (ఫిబ్రవరి 2) ప్రారంభ సెషన్‌లో అతి స్వల్పంగా తగ్గింది. మొత్తానికి రూ.49,000 దిగువకు వచ్చిన పసిడి, ఇప్పుడు రూ.48,000 స్థాయికి కనిపిస్తోంది. అంటే ఆల్ టైమ్ గరిష్టం రూ.56,600తో చూస్తే రూ.8000కు పైగా తక్కువకు వచ్చేలా ఉంది. నిన్న పసిడి ధరలు దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో(MCX) ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.710, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.627 తగ్గింది. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ భారీగా షాకిచ్చింది. కిలో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.4,238 పెరిగి రూ.73వేలు దాటింది. రూ.73,944 వద్ద క్లోజ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.4,159 పెరిగి పెరిగి రూ.74,900 దాటింది.

49,000 దిగువకు పసిడి
ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 8.00 (0.02%) తగ్గి రూ.48,386.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,624.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,485.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,624.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7100కు పైగా తక్కువ ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 394.00 (0.81%) పెరిగి రూ.49,330.00 వద్ద ముగిసింది. రూ.49,050.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,831.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,992.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నిన్న భారీగా జంప్, నేడు తగ్గుదల
వెండి నిన్న భారీగా షాకిచ్చింది. నేడు తగ్గింది. నిన్న రూ.4వేలకు పైగా పెరిగిన వెండి నేడు రూ.1700 వరకు తగ్గింది. అయినప్పటికీ రూ.70,000కు పైనే ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 1,704.00 (2.31%) తగ్గి రూ.71,962.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,600.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,600.00 వద్దనే గరిష్టాన్ని తాకి, రూ.71,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.1,681.00 (2.25%) తగ్గి రూ.73150.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,359.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,959.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గి 1860 డాలర్ల దిగువకు చేరింది. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 6.00 (0.32%) పెరిగి 1,857.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,856.15 - 1,866.30 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.79% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ సిల్వర్ ధర 0.888 (3.04%) డాలర్లు పెరిగి 28.525 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.370 - 29.250 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 60.29శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications