బంగారం ధర మళ్లీ తగ్గింది.. అక్కడ వెండి జూమ్: కీలక ప్రతిఘటన.. మద్దతు ధర
బంగారం, వెండి ధరలు ఈరోజు(సెప్టెంబర్ 30) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు క్షీణించడంతో ఇక్కడా ప్రభావం పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి డిసెంబర్ ఫ్యూచర్స్ 0.5 శాతం క్షీణించి రూ.50,386 పలికింది. గత 3 సెషన్లలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇటీవల రూ.50వేల దిగువకు వచ్చిన పసిడి ధరలు, ఈ మూడు రోజుల్లో తిరిగి 50వేల మార్క్ దాటాయి. ఆగస్ట్ 7వ తేదీన రూ.56,200 మార్క్ దాటిన పసిడి, ఆ తర్వాత క్రమంగా క్షీణించింది.

బంగారం, వెండి ధరల్లో క్షీణత
ఈరోజు ప్రారంభ సెషన్‌లో ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు రూ.50,400 దిగువకు వచ్చాయి. వెండి కిలో రెండు శాతం క్షీణించి రూ.61,267కు దిగి వచ్చింది. ధర స్వల్పంగా క్షీణించింది. అంతకుముందు సెషన్‌లో బంగారం రూ.500 పెరగగా, వెండి రూ.1900 ఎగిసింది. ఈ వారంలో పసిడి ధర రూ.49,500 స్థాయికి వచ్చింది. ఈ మూడు రోజుల్లో రూ.800కు పైగా పెరిగింది. అయితే గత నెల గరిష్ట ధరతో ఇప్పటికీ రూ.5,500కు పైన తక్కువ పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.1 శాతం క్షీణించి 1,896.03 డాలర్లు పలికింది. వెండి ధర మాత్రం 0.2 శాతం పెరిగి 24.22 డాలర్లకు ఎగిసింది. ప్లాటినమ్ 0.1 శాతం ఎగిసి 883.25 డాలర్లు, పల్లాడియం 0.5 శాతం లాభపడి 2,319.59 వద్ద ట్రేడ్ అయింది.

కీలక ప్రతిఘటన
దేశీయ ఎంసీఎక్స్‌లో పసిడి రూ.50,800-రూ.50,920 మధ్య కీలక ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.50,330-రూ.50200 మద్దతు ధర కొనసాగవచ్చునని చెబుతున్నారు. రూ.50,800-రూ.50920 ప్రతిఘటన ఎదుర్కోవచ్చు. వెండి కిలో రూ.61,800-రూ.61,200 వద్ద మద్దతు ధర, రూ.63,100-రూ.63,800 ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని అంచనా వేస్తున్నారు. అమెరికా తన రెండో ఆర్థిక ప్యాకేజీని ఈ వారంలో ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో డాలర్ వ్యాల్యూ క్షీణించి, బంగారం, వెండి ధరలు నిన్న పెరిగాయి. డాలర్ వ్యాల్యూ 94 మార్క్ దిగువకు చేరుకుంది. అగ్రరాజ్యం 2.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనుంది.

బంగారం ధరలు..
నిన్న బంగారం ధరలు హైదరాబాద్, విశాఖష విజయవాడలో పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.500 పెరిగి రూ.52,530, 22 క్యారెట్ల పసిడి రూ.48,160కి చేరుకుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.48,900, 22 క్యారెట్ల బంగారం రూ.53,350 చేరుకుంది. అయితే ఎంసీఎక్స్, కామెక్స్‌లో ఈ రోజు క్షీణించాయి.


Click it and Unblock the Notifications