Gold Price: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు బుధవారం(ఆగస్ట్ 25) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.259.00 (-0.54%) క్షీణించి రూ.47353.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.234.00 (-0.49%) తగ్గి రూ.47545.00 వద్ద ట్రేడ్ అయింది.
సిల్వర్ ఫ్యూచర్స్ సెప్టెంబర్ రూ.426.00 (-0.67%) నష్టపోయి రూ.63048.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.437.00 (-0.68%) పెరిగి రూ.63760.00 వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల రూ.63,000 దిగువనే ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న భారీగా లాభపడ్డాయి. నేడు మరోసారి క్షీణించినప్పటికీ రూ.63,000 పైనే ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 13.05 (0.72%) డాలర్లు క్షీణించి 1,795.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు 0.187 (-0.78%) ధరలు క్షీణించి 23.707 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు ఈ నెల ప్రారంభంలో నాలుగు నెలల కనిష్టానికి రూ.45,600 దిగువకు పడిపోయాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56.200కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర స్వల్పంగా క్షీణించి 1800 డాలర్ల వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్ 93 డాలర్లు క్రాస్ చేసి తొమ్మిదిన్నర నెలల గరిష్టానికి చేరుకుంది.
బంగారం ధరలు 1808 డాలర్ల నుండి 1820 డాలర్లకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మద్దతు ధర 1785 డాలర్ల నుండి 1773 డాలర్లుగా పేర్కొంటున్నారు. సిల్వర్ ధరలు 23.00 డాలర్ల పైనే ముగిసే అవకాశాలు ఉన్నాయని, మరింతగా పెరిగితే 24.10 డాలర్ల నుండి 25.22 డాలర్ల పైకి చేరుకోవచ్చుని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications