ముంబై: పసిడి కొనుగోలుదారులకు అదిరిపోయే న్యూస్! బంగారం ధరలు పడిపోతున్నాయి!! క్రితం వారం వరకు వరుసగా రెండు వారాలు రూ.3వేల వరకు క్షీణించిన పసిడి ధరలు, నిన్న రూ.700కు పైగా పడిపోగా, నేడు మరింత పతనమయ్యాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7600కు పైగా క్షీణించింది. వ్యాక్సీన్ పైన సానుకూల ప్రకటనలు పసిడిపై ఒత్తిడిని తగ్గిస్తున్నాయి. ఈ వారంలో రెండు రోజుల్లోనే దాదాపు రూ.1700 వరకు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే క్షీణించాయి.

రూ.900 వరకు తగ్గిన పసిడి
బంగారం ధరలు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో భారీగా క్షీణించాయి. 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.890.00 (-1.80%) తగ్గి రూ.48,590.00కు పడిపోయింది. రూ.49,262.00 వద్ద ప్రారంభమై, రూ.49,262.00 గరిష్టాన్ని, రూ.48,514.00 కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.-897.00 (-1.81%) క్షీణించి రూ.48,568.00 వద్ద ముగిసింది. రూ.49,050.00 వద్ద ప్రారంభమై, రూ.49,141.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,460.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
నిన్న రూ.732 తగ్గిన పసిడి ఫ్యూచర్ నేడు రూ.897 వరకు తగ్గింది. ఈ రెండు రోజుల్లో రూ.1,600కు పైగా క్షీణించింది.

రూ.60,000 దిగువకు వెండి
వెండి కిలో రూ.60,000 దిగువకు వచ్చింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,194.00 (-1.97%) క్షీణించి రూ.59,331.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.60,064.00 వద్ద ప్రారంభమై, రూ.60,251.00 వద్ద గరిష్టాన్ని, రూ.58,827.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,205.00 (-1.93%) క్షీణించి రూ.61,154.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,000.00 వద్ద ప్రారంభమై, రూ.62,040.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,695.00 వద్ద కనిష్టాన్ని తాకింది.ట
వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో పోలిస్తే రూ.20,000 తగ్గాయి.

1800 డాలర్ల వద్దకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ -35.25 (-1.92%) డాలర్లు తగ్గి 1,802.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. చాలా రోజులకు బంగారం 1800 డాలర్ల సమీపానికి చేరుకుంది. 1,797.65 - 1,836.90 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో బంగారం 25.37% పెరిగింది. క్రితం సెషన్లో 1837.80 డాలర్ల వద్ద ముగిసింది.
ఔన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ -0.388 (-1.64%) డాలర్లు తగ్గి 23.247 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 22.942 - 23.650 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 23.633 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి 37 శాతం పెరిగింది.
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..



Click it and Unblock the Notifications