Gold prices today: తగ్గిన బంగారం ధరలు, పెరిగిన వెండి ధర
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేడు (మార్చి 26, శుక్రవారం) పసిడి ధరలు క్షీణించగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. నెల ప్రారంభంలో బంగారం ధరలు ఓ సమయంలో రూ.44,150 వద్ద పలికి ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. ఆ తర్వాత స్వల్పంగా పుంజుకున్నప్పటికీ రూ.45వేలకు దిగువనే కదలాడుతోంది. కరోనా కేసులు పెరగడం, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో తగ్గడానికి బదులు కాస్త స్థిరంగా కదలాడుతున్నాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి రూ.56,200 ఆల్ టైమ్ గరిష్టంతో చూస్తే పసిడి ధరలూ రూ.11,700 తక్కువగా ఉన్నాయి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
గోల్డ్ ఫ్యూచర్ నేడు సాయంత్రం సెషన్‌లో స్థిరంగా ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.128.00 (0.29%) తగ్గి రూ.44567.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,635.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,635.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,523.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,700 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.133.00 (-0.29%) తగ్గి రూ.44979.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,107.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45107.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,950.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పెరిగిన వెండి
సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.106.00 (-0.16%) పెరిగి రూ.64975.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,975.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,039.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,774.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.115.00 (0.17%) పెరిగి రూ.66601.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,952 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,068 వద్ద గరిష్టాన్ని, రూ.65,794 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.50 (-0.03%) డాలర్లు తగ్గి 1,724.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,721.35 - 1,728.25 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల వద్దనే కదలాడుతోంది. ఔన్స్ ధర 0.160 (+0.64%) డాలర్లు తగ్గి 25.207 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.098 - 25.242 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications