బంగారం ధరలు నేడు (సోమవారం, 25) మరింత క్షీణించాయి. అయితే రూ.49,000కు పైనే ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గత నెల రోజులకు పైగా పసిడి ధరలు రూ.50,000కు కాస్త అటు ఇటు కదలాడుతున్నాయి. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినైజేషన్ నేపథ్యంలో పసిడి ధరలు రూ.50,000 దిగువకు వచ్చాయి. పసిడి ధరలు ఈ వారం రూ.48,540 దిగువకు రాకుంటే సానుకూలం ధోరణి కనిపించవచ్చు. రూ.49,760 వద్ద గోల్డ్ ఫ్యూచర్ నిరోధకం కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ వారం పసిడిపై అమెరికా ఫెడ్ రిజర్వ్ భేటీ-నిర్ణయాలు, అమెరికా జీడీపీ గణాంకాలు ప్రభావం చూపనున్నాయి.

రూ.49,200 దిగువనే
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 55.00 (-0.11%) క్షీణించి రూ.49,085.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,155.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,171.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,054.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7200 వరకు తక్కువగా ఉంది. బంగారం ధరలు కొద్ది రోజులుగా రూ.50వేల సమీపంలో కదలాడుతున్నాయి.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 78.00 (-0.16%) తగ్గి రూ.49,220.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,294.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,294.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,220.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.67వేల దిగువకు
బంగారం ధరలు తగ్గగా, వెండి ఫ్యూచర్స్ కూడా అదే దారిలో నడిచింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 219.00 (0.33%) తగ్గి రూ.66961.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,896.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,957.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,713.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.67520.00 వద్ద ఉంది.

1870 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర క్షీణించి 1860 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.85 (-0.05%) డాలర్లు తగ్గి 1,855.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,852.45 - 1,859.50 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 16.05% శాతం పెరిగింది. సిల్వర్ బంగారం తగ్గగా, ఫ్యూచర్స్ పెరిగింది. ఔన్స్ ధర 0.159 (+0.62%) డాలర్లు పెరిగి 25.715 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. చివరి సెషన్లో 25.527 - 25.753 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40.43శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications