బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే 18 శాతం వరకు లేదా దాదాపు రూ.9,800 వరకు తక్కువగా ఉన్నాయి. వెండి ధరలు నేడు పెరిగాయి. అయితే కిలో రూ.70వేల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గి, వెండి ధరలు పెరిగాయి.
ఇటీవల పసిడి ధరలు క్షీణిస్తుండగా, వెండి ధరలు మాత్రం కాస్త సానుకూలంగా ఉన్నాయి. రూ.47,000 దిగువకు వచ్చిన పసిడి, చాన్నాళ్లుగా ఇదే స్థాయిలో తచ్చాడుతోంది. కరోనా కేసులు, వ్యాక్సినేషన్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, వడ్డీ రేట్లు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి.

బంగారం ధర మరింత తగ్గింది
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.57.00 (0.12%) తగ్గి రూ.46,465.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,443.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,486.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,423.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9,800 తక్కువ ఉంది.
గత వారం ఓ సమయంలో రూ.10వేల తక్కువకు పడిపోయింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.98.00 (0.21%) తగ్గి రూ.46,579 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,579 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,579 వద్ద గరిష్టాన్ని, రూ.46,579వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలో పెరుగుదల
వెండి ధరలు పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.437.00 (0.63%) తగ్గి రూ.69,980.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,126.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,126.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,880.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.473.00 (0.67%) పెరిగి రూ.71,280.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,304.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,378.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,207.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువనే పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడూ తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1.25 (-0.07%) డాలర్లు పెరిగి 1796.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,793.00 - 1,804.85 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 7.77 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. ఔన్స్ ధర 0.234 (0.84%) డాలర్లు పెరిగి 28.093 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.883 - 28.170 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications