నిన్న భారీగా పెరుగుదల, నేడు మళ్లీ తగ్గిన బంగారం ధరలు: హైదరాబాద్‌లో భారీగా తగ్గుదల
బంగారం ధరలు ఏడు రోజుల్లో ఆరు రోజుల పాటు క్షీణించాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు సెషన్‌లో వారంలో తొలిసారి లాభపడ్డ పసిడి, దానిని కొనసాగించలేకపోయింది. ఈరోజు(ఆగస్ట్ 27, గురువారం) ప్రారంభ ట్రేడింగ్‌లో తగ్గుముఖం పట్టింది. కరోనా మహమ్మారి కారణంగా రెండు వారాల క్రితం వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, రష్యా వ్యాక్సీన్ వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టాయి.

నిన్న భారీగా పెరిగి, నేడు స్వల్పంగా తగ్గుదల
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.22 శాతం క్షీణించి 10 గ్రాములు రూ.51,665 పలికింది. నిన్న ఉదయం ప్రారంభంలో 0.4 శాతం ఎగిసిన ధరలు ఆ తర్వాత మరింతగా పెరిగాయి. వరుసగా ఐదు రోజుల పాటు తగ్గిన ధరలు నిన్న ఒక్కరోజు దాదాపు రూ.900 ఎగిసింది. వెండి ధర ఏకంగా రూ.3500 పెరిగింది. నేడు మాత్రం ప్రారంభ సెషన్‌లో పసిడి 0.22 శాతం తగ్గింది. వెండి కిలో 1 శాతం పడిపోయి రూ.66,821 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,952.11 డాలర్లు పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.8 శాతం తగ్గి ఔన్స్ 27.30 డాలర్లు, ప్లాటినమ్ 0.6 శాతం తగ్గి ఔన్స్ 934.29 డాలర్లు పలికింది. పల్లాడియం ఔన్స్ 0.6 శాతం పడిపోయి 2,184 డాలర్లకు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ దాదాపు 0.2 శాతం వారం కనిష్టానికి చేరుకుంది.

హైదరాబాద్‌లో రూ.54,000 దిగువకు
బులియన్ మార్కెట్లో పసిడి ధర తగ్గింది. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర 24 క్యారెట్లు రూ.400 వరకు పడిపోయి రూ.53,660కి చేరుకుంది. ఓ సమయంలో రూ.59వేల మార్క్ సమీపానికి చేరుకున్న ధరలు ఇప్పుడు దాదాపు 5,500 వరకు తక్కువ పలుకుతోంది. 22 క్యారెట్ల పసిడి రూ.300 వరకు తగ్గి రూ.49,200కు చేరుకుంది. వెండి కిలో ధర స్వల్పంగా పెరిగి రూ.65,550 పలికింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications