For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, తగ్గిన బంగారం, వెండి ధరలు: ఎక్కడ ఎంత అంటే

|

బంగారం, వెండి ధరలు ఈరోజు (సెప్టెంబర్ 21, సోమవారం) స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 శాతం తగ్గి 10 గ్రాములు రూ.51,637 పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.13 శాతం తగ్గి కిలో రూ.67,790 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం 0.52 శాతం పెరిగింది. వెండి కిలో 0.2 శాతం తగ్గింది. మొత్తానికి గతవారంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత నెల 7వ తేదీన పసిడి ధర 10 గ్రాములు రూ.56,200 పలికింది. నాటి ధరతో పోలిస్తే ఇప్పటికీ రూ.4,500 తక్కువగా ఉంది.

Gold Price Today: బంగారం ధరలు మరింతగా పెరుగుతాయా?Gold Price Today: బంగారం ధరలు మరింతగా పెరుగుతాయా?

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లో బంగారం ధరలు రూ.200 మేర పెరిగింది. 24 క్యారెట్ల పసిడి రూ.54,100 పలికింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.49,600 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.54,860 పలికింది. 22 క్యారెట్ల బంగారం రూ.50,350 పలికింది.

ఔన్స్ ధర 1954 డాలర్లు

ఔన్స్ ధర 1954 డాలర్లు

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా 0.3శాతం పెరిగి ఔన్స్ ధర 1,954.65 పలికింది. పెరుగుతున్న కరోనా కేసులు, బలహీనమైన అమెరికా డాలర్ వంటి వివిధ కారణాలతో బంగారం ధరలు అస్థిరంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. పసిడి ధరలు 1880 డాలర్ల నుండి 1975 డాలర్ల మధ్య తచ్చాడుతుందని భావిస్తున్నారు. వ్యాక్సీన్ రాక, కరోనాపై ప్రకటనల ఆధారంగా పసిడి ధర భారీగా పెరగడం లేదా తగ్గడం ఉంటుందని చెబుతున్నారు. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే 0.6 శాతం లాభపడి 26.92 డాలర్లు, ప్లాటినమ్ 1.3 శాతం పెరిగి 939.75 డాలర్లు పలికింది. ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద నిల్వలు శాతం పెరిగి 1259.84 టన్నులకు చేరుకుంది.

ఈ నెలలో ఎంత పెరిగిందంటే

ఈ నెలలో ఎంత పెరిగిందంటే

ఈ నెల ప్రారంభం నుండి స్పాట్ గోల్డ్ రూ.500కు పైగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.800 వరకు పెరుగుదలను నమోదు చేసింది. ఈ నెల 2వతేదీన స్పాట్ గోల్డ్ 10 గ్రాములు రూ.51,100 ఉండగా, ఇప్పుడు రూ.51,600 పైనకు చేరుకుంది. ఫ్యూచర్ గోల్డ్ రూ.50,800 ఉండగా, ఇప్పుడు రూ.51,600 పైన ఉంది.

English summary

గుడ్‌న్యూస్, తగ్గిన బంగారం, వెండి ధరలు: ఎక్కడ ఎంత అంటే | Gold prices today fall for second time in three days, silver rates drop

Gold and silver prices edged lower in India despite higher global rates. On MCX, gold futures fell 015% to ₹51637 per 10 gram while silver futures declined 0.13% to ₹67790 per kg. In the previous session, gold had risen 0.52% while silver had edged 0.2% lower.
Story first published: Monday, September 21, 2020, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X