ముంబై: బంగారం, వెండి ధరలు గురువారం(అక్టోబర్ 15) క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ 0.26 శాతం (రూ.129) క్షీణించి రూ.50,413 పలికింది. నేడు రూ.50,314 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.11 సమయం వరకు రూ.50,445 వద్ద గరిష్టాన్ని, రూ.50,314 కనిష్టాన్ని తాకింది. ఇదే ధర వద్ద ట్రేడ్ అవుతోంది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.64 క్షీణించి రూ.50,560 పలికింది. రూ.50,552 వద్ద ప్రారంభం కాగా, 11 గంటల వరకు రూ.50,580 వద్ద గరిష్టాన్ని, రూ.50,507 కనిష్టాన్ని తాకింది.

బంగారం, వెండి తగ్గుదల
తాజా తగ్గుదలతో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,700కు పైగా తక్కువగా ఉంది. బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. డిసెంబర్ వెండి ఫ్యూచర్ కిలో రూ.493(-0.80%) క్షీణించి రూ.61,110 వద్ద ట్రేడ్ అయింది. ఫ్యూచర్ మార్కెట్లో వెండి రూ.61,114 వద్ద ప్రారంభమై రూ.61,265 వద్ద గరిష్టా్ని తాకింది. ఓ సమయంలో రూ.60,811 వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం రూ.500 తగ్గుదలతో ట్రేడ్ అవుతోంది. వెండి మార్చి ఫ్యూచర్ రూ.453 (-0.71%) తగ్గి రూ.62,966 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో కూడా పసిడి ధరలు క్షీణించాయి. కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 0.16 శాతం క్షీణించి 1,904.35 డాలర్లు పలికింది. 1,895.65 - 1,906.85 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1907 వద్ద క్లోజ్ అయింది. వెండి ఫ్యూచర్స్ 0.59 శాతం క్షీణించి 24.245 డాలర్లు పలికింది. 24.067 - 24.410డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.395 వద్ద క్లోజ్ అయింది.

బంగారం ధరలు..
నిన్న ప్రారంభంలో ఎంసీఎక్స్ పసిడి ధరలు పెరిగాయి. ఓ సమయంలో బంగారం రూ.275 పెరిగి రూ.50,520 పలికింది. ఆ తర్వాత క్షీణించాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో రూ.300 వరకు తగ్గి 24 క్యారెట్ల బంగారం రూ.52,790 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.48,360 పలికింది.
More From GoodReturns

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!



Click it and Unblock the Notifications