ముంబై: బంగారం ధరలు బుధవారం(నవంబర్ 11) క్షీణించాయి. పసిడి ధరలు ఇప్పటికీ ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5800 తక్కువగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో సాయంత్రం 4 గంటల సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.103.00 (-0.20%) తగ్గి రూ.50,398.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,444.00 వద్ద ప్రారంభమైన పసిడి, రూ.50,525.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,259.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి ధరలు మూడు సెషన్‌లలో రెండు సెషన్లు తగ్గుముఖం పట్టాయి.

స్వల్పంగా తగ్గిన ధర
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.100కు పైగా క్షీణించగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ 82.00 (-0.16%) తగ్గి రూ.50,495.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,530.00 వద్ద ప్రారంభం కాగా, రూ.50,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,375.00 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా,
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు నిన్న (మంగళవారం, నవంబర్ 10) భారీగా పెరిగాయి. 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.701.00 (1.41%) పెరిగి రూ.50,449 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.632 (1.27 శాతం) పెరిగి రూ.50,525 వద్ద ముగిసింది.
డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.2,013.00 (3.31%) పెరిగి రూ.62,867.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.2,117.00 (3.38%) పెరిగి రూ.64,720.00 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు బంగారం రూ.2500కు పైగా, వెండి కిలో రూ.4000కు పైగా తగ్గింది. నిన్న పెరిగిన ధరలు ఈ రోజు మళ్ళీ తగ్గాయి.

రూ.500 తగ్గిన వెండి
డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ కిలో రూ.565.00 (-0.90%) క్షీణించి రూ.62,479.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,000.00 ప్రారంభమైన ధర, రూ.63,044.00 గరిష్టాన్ని, రూ.62,097.00 కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.520.00 (-0.80%) తగ్గి రూ.64,179 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,443.00 వద్ద ప్రారంభమై, రూ.64,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,874.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 0.11 శాతం క్షీణించి 1,875 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,872.35 - 1,882.35 డాలర్ల మధ్య పలికింది. క్రితం సెషన్లో 1876 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 26 శాతం పెరిగింది. ఇటీవల 1950 డాలర్లను తాకిన పసిడి మళ్లీ 1900 డాలర్ల దిగువకు వచ్చింది.
వెండి ఫ్యూచర్స్ 0.71 శాతం తగ్గి 24.288 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.172 - 24.512 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.462 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో వెండి 42 శాతానికి పైగా పెరిగింది.
More From GoodReturns

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!



Click it and Unblock the Notifications