ముంబై: బంగారం ధరలు నేడు (శుక్రవారం, 8) మళ్లీ క్షీణించాయి. ఈ వారం మొదటి రెండు సెషన్లలో రూ.1500 వరకు పెరిగిన బంగారం ధరలు, రెండు రోజుల క్రితం రూ.1200కు పైగా తగ్గాయి. నిన్న పెరిగి, నేడు మళ్లీ క్షీణించింది. గత మూడు రోజుల్లో రెండు సెషన్లలో ధరలు తగ్గాయి. ఈ వారంలోని ఐదు సెషన్లలో మూడు రోజులు ధరలు పెరగగా, రెండుసార్లు తగ్గాయి. ఈ వారం పసిడి ఓ సమయంలో రూ.51,000 దాటి రూ.52,000 దిశగా కనిపించింది. ఈ రోజు రూ.51,000 దిగువనే ఉంది.

బంగారం ధరలు డౌన్
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 192.00 (-0.38%) తగ్గి రూ.50712.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,755.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,799.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,672.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5500 తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.204.00 (0.40%) తగ్గి రూ.50736.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,850.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,850.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,736.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర రూ.300 డౌన్
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.300 వరకు తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 265.00 (-0.38%) క్షీణించి రూ.69697.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,694.00 వద్ద ప్రారంభమై, రూ.69,825.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,600.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.320.00 (-0.45%) పెరిగి రూ.70660.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,705.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,705.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,632.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడా డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గాయి. అయితే 1900 డాలర్ల పైనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.05 (-0.11%) డాలర్లు తగ్గి 1,911.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,907.40 - 1,918.00 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 20.5% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. ఔన్స్ ధర 0.071 (-0.26%) డాలర్లు తగ్గి 27.190 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.098 - 27.335 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48.15 శాతం పెరిగింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications