వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు, అక్కడ మాత్రం పెరుగుదల
బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.2 శాతం తగ్గి రూ.45,722 పలికింది. అంతకుముందు సెషన్‌లో 0.70 శాతం పడిపోయింది. వెండి ధర కిలో 0.42 శాతం తగ్గి రూ.43,475 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,700 మార్క్ దాటి పలుకుతోంది.

ఎంసీఎక్స్‌లో..
ఉదయం నుండి ఎంసీఎక్స్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. గం.10.23 సమయానికి గోల్డ్ జూన్ కాంట్రాక్ట్ రూ.57 లేదా 0.12 శాతం తగ్గి రూ.45,755 పలికింది. గోల్డ్ ఫ్యూచర్స్ మార్చి నెలలో రూ.47,327 పలికి ఆల్ టైమ్ హైగా నిలిచింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.139 తగ్గి రూ.45,700కు దిగువకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఐనా పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఔన్స్‌కు 1,700 డాలర్లకు పైనే కదలాడుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, డాలర్ బలపడినప్పటికీ బంగారం ధర పెరిగింది. వివిధ దేశాలు షట్ డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఇవన్నీ బంగారంపై కాస్త ఒత్తిడి తగ్గించే అంశాలు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధరలు ఈ రోజు 0.2 శాతం పెరిగి 1,704.26 డాలర్లు పలికింది. ఇతర అతి ఖరీదైన మెటల్స్ విషయానికి వస్తే ప్లాటినమ్ 0.7 శాతం పెరిగి 770.66 డాలర్లు, వెండి 0.4 శాతం పెరిగి 15.5 డాలర్లు పలికింది.

బంగారానికి డిమాండ్ పెరుగుతున్న సమయంలో..
బంగారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ బాండ్స్ రెండో విడత సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించింది. ఇది మే 15వ తేదీన ముగుస్తుంది. ఒక గ్రాము బంగారం ధరను రూ.4,590గా నిర్ణయించింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని డిజిటల్ మోడ్ ద్వారా చెల్లిస్తే గ్రాముకు రూ.50 తగ్గింపు లభిస్తుంది.


Click it and Unblock the Notifications