బంగారం కొనాలా.. గుడ్‌న్యూస్: ఆల్‌టైం గరిష్టంతో రూ.9,000 డౌన్
ముంబై: బంగారం ధరలు నేడు (ఫిబ్రవరి 12, శుక్రవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఉదయం సెషన్లో అతి స్వల్పంగా రూ.16 తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.9000 వరకు తక్కువగా ఉంది. చాలా రోజులకు ఆల్ టైమ్ గరిష్టంతో ఈ స్థాయిలో తగ్గింది. కాగా, నిన్న ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.468 తగ్గి రూ.47,545 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.485 క్షీణించి రూ.47,650 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.226 క్షీణించి రూ.68,700, మే ఫ్యూచర్స్ సిల్వర్ రూ.206 తగ్గి రూ.69,785 వద్ద ముగిసింది.

రూ.47,500 దిగువకు పసిడి
బంగారం రూ.47,500 దిగువకు వచ్చింది. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.18.00 (-0.04%) తగ్గి రూ.47,490.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,411.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,411.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000కు పైగా తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.18.00 (-0.04%) తగ్గి రూ.47,650 వద్ద ట్రేడ్ అయింది.

పసిడి నిన్న తగ్గి, నేడు పెరిగి.
నిన్న తగ్గిన వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. వెండి రూ.69వేల దిగువనే ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.242.00 (0.35%) పెరిగి రూ.68,734.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,506.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,764.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,506.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.138.00 (0.20%) పెరిగి రూ.69,829.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,646.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,857.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,646.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

గోల్డ్ ఫ్యూచర్స్ భారీగా డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నిన్న, ఇవాళ భారీగా తగ్గాయి. ఔన్స్ 1850 డాలర్ల దిశగా కనిపించిన పసిడి ఇప్పుడు 1821 స్థాయికి పడిపోయింది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 5.15 (-0.28%) డాలర్లు తగ్గి 1821.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,819.65 - 1,827.85 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.46 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.009 (-0.03%) డాలర్లు తగ్గి 27.040 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.922 - 27.090 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 52.62 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications