ముంబై: బంగారం ధరలు వరుసగా రెండో రోజు క్షీణించాయి. పసిడి ధరలు క్షీణించినప్పటికీ రూ.49 వేల పైనే కదలాడుతున్నాయి. నిన్న గురువారం ఓ సమయంలో భారీగా తగ్గి రూ.49,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత కాస్త పుంజుకున్నాయి. రూ.200కు పైగా నష్టపోయినప్పటికీ, చివరకు రూ.49,000 పైన క్లోజ్ అయింది. ఇటీవల పసిడి ధరలు పైకీ కిందకు కదులుతున్నాయి. రూ.52వేల దిగువ నుండి రూ.48,000 పైన కదలాడుతున్నాయి. డాలర్ క్షీణించడం, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ తక్కువగా ట్రేడ్ కావడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ కూడా ఉంది. పసిడి ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7200 వరకు తక్కువగా ఉంది.

49,000 పైన పసిడి
నేడు (శుక్రవారం 15, జనవరి) ఉదయం ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 61.00 (-0.12%) తగ్గి రూ.49,160.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,088.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,188.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,077.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.62.00 (-0.13%) తగ్గి రూ.49,167.00 వద్ద ప్రారంభమైంది. రూ.49,130.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,178.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,130.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.560 తగ్గిన వెండి
సిల్వర్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా భారీగానే తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 568.00 (-0.85%) తగ్గి రూ.66115.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,978.00 వద్ద ప్రారంభమై, రూ.66,266.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,978.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.-173.00 (-0.26%) తగ్గి రూ.67098.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,026.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,105.00 వద్ద గరిష్టాన్ని, రూ.67026.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల వద్ద...
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్ల వద్ద ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.30 (+0.02%) డాలర్లు తగ్గి 1,851.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,845.40 - 1,855.60 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17.29% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.160
(-0.62%) డాలర్లు తగ్గి 25.642 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.565 - 25.855 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 42.4 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications