మూడ్రోజుల తర్వాత తగ్గిన బంగారం ధరలు, అదేదారిలో వెండి
ముంబై: గత మూడు నాలుగు రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఈ రోజు ప్రారంభ సెషన్‌లో క్షీణించాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ 0.47 శాతం (రూ.242) తగ్గి రూ.50,865 పలికింది. నిన్న రూ.51వేల మార్క్ దాటిన పసిడి ఈ రోజు ప్రారంభంలో దిగివచ్చింది. రూ.50,870 వద్ద ప్రారంభించింది. ఓ సమయంలో రూ.50,766కు దిగి వచ్చింది. గరిష్టం రూ.50,914ని తాకింది. ఆగస్ట్ 7న బంగారం ఆల్ టైమ్ హై రూ.56,200 తాకింది. ఆ ధరతో రూ.5,300కు పైన తక్కువగా ఉంది.

వెండి ధర ఎంత తగ్గిందంటే
ఎంసీఎక్స్‌లో డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ కిలో రూ.544 (0.86 శాతం) తగ్గి రూ.62,554 వద్ద ట్రేడ్ అయింది. నేడు రూ.62,401 వద్ద ప్రారంభమైన వెండి ఫ్యూచర్స్ రూ.62,778 వద్ద గరిష్టాన్ని, రూ.62,126 వద్ద కనిష్టాన్ని తాకింది.
బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో 0.55 శాతం, వెండి ధరలు 0.26 శాతం లాభపడ్డాయి. పది రోజుల క్రితం రూ.50వేల దిగువన ఉన్న బంగారం అంతర్జాతీయ పరిణామాలతో నిన్న రూ.51వేలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న దిగి రావడంతో దేశీయంగా తగ్గుముఖం పట్టింది.

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్‌లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం క్షీణించి ఔన్స్ 1,919.51 డాలర్లు పలికింది. కామెక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 0.48 శాతం క్షీణించి 1,919.65 డాలర్లు పలికింది. 1,915.25 - 1,930.15 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.
డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ ఔన్స్ 0.95 శాతం క్షీణించి 25.038 డాలర్లు పలికింది. 24.727 - 25.305 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.
ఆగస్ట్ మొదటి వారంలో పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం 2,072 డాలర్లు దాటిన విషయం తెలిసిందే.
సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ 0.09 శాతం పెరగడంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు
ముంబైలో 22 క్యారెట్ల పసిడి రూ.49,820, 24 క్యారెట్ల బంగారం రూ.50,820, ఢిల్లీలో 22 క్యారెట్లు రూ.49,800, 24 క్యారెట్లు రూ.54,330, చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.48,870, 24 క్యారెట్ల బంగారం రూ.53,310 పలికింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రూ.48,870, 24 క్యారెట్ల బంగారం రూ.53,310కి చేరుకుంది.


Click it and Unblock the Notifications