Gold prices today: తగ్గిన బంగారం, వెండి ధరలు: రూ.48,000 దిగువకు..
ముంబై: పసిడి ధరలు నేడు (గురువారం, ఫిబ్రవరి 11) తగ్గాయి. వరుసగా నాలుగు సెషన్లలో స్వల్పంగా పెరుగుతూ వచ్చిన ధరలు నేడు క్షీణించాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8400 తక్కువగా ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న అతి స్వల్పంగా రూ.59 పెరిగి రూ.48,007 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.90 పెరిగి రూ.48,150 వద్ద క్లోజ్ అయింది. అదే సమయంలో నిన్న వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ఫ్యూచర్ మార్చి రూ.846 తగ్గి రూ.68,850 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.754 క్షీణించి రూ.70,024 వద్ద క్లోజ్ అయింది.

మరింత తగ్గిన బంగారం ధర
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.160.00 (0.33%) తగ్గి రూ.47,853.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,837.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,879.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,837.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8400 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.115.00 (-0.24%) తగ్గి రూ.48,020 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,020.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,020.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,002.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.69,000 దిగువకు వెండి
వెండి ధర తగ్గి, రూ.69వేల దిగువకు చేరుకుంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 672.00 (0.97%) తగ్గి రూ.68,254.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,400.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,212.00 వద్ద కనిష్టాన్ని తాకింది.మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.629.00 (0.90 శాతం) తగ్గి రూ.69362.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,289.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,488.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,289.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1840 డాలర్ల దిగువకు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. 1840 డాలర్ల దిగువకు చేరుకుంది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 5.85 (-0.32%) డాలర్లు తగ్గి 1836.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,835.55 - 1,845.30డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.73 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. ఔన్స్ ధర 0.203 (-0.75%) డాలర్లు తగ్గి 26.875 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.750 - 27.140 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 52.08 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications