బంగారం ధరలు భారీగా తగ్గాయి, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9500 డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు నేడు ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ కాస్త పెరిగాయి. వరుసగా ఏడు రోజుల పాటు ధరలు తగ్గాయి. నేడు అతి స్వల్పంగా పెరిగినప్పటికీ 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000కు దిగువనే ఉంది. ఇటీవలే రూ.70000 దిశగా పరుగులు పెట్టిన వెండి ఇప్పుడు రూ.67500 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో వెండి ధరలు స్వల్పంగా తగ్గగా, బంగారం ధరలు పెరిగాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.రూ.56200తో రూ.9500 వరకు తక్కువగా ఉంది.

రూ.46,800 దిగువకు పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.30.00 (0.06%) పెరిగి రూ.46756.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,743.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,788.00 గరిష్టాన్ని, రూ.46,620.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.8.00 (0.02%) పెరిగి రూ.47043.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,000.00 వద్ద ప్రారంభమై, రూ.47,090.00 గరిష్టాన్ని, రూ.46,962.00 కనిష్టాన్ని తాకింది.

వెండి ధరల్లో తగ్గుదల
వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.51.00 (-0.08%) తగ్గి రూ.67423.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,395.00 వద్ద ప్రారంభమై, రూ.67,614.00 గరిష్టాన్ని, రూ.67,348.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62.00 (-0.09%) తగ్గి రూ.68575.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,465.00 ప్రారంభమైన ధర, రూ.68,720.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,339.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. +2.05 (0.12%) డాలర్లు తగ్గి 1,770.35 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,765.15 - 1,773.25 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.068 (0.26%) డాలర్లు తగ్గి 25.985 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.925 - 26.157 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications