బంగారం ధరలు వరుసగా ఆరో రోజు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.9000 తక్కువగా ఉంది. బంగారం ధరలు నేడు రూ.47,000 దిగువకు వచ్చాయి. కరోనా వ్యాక్సీన్ డ్రైవ్ నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి తగ్గింది. మే 1వ తేదీ నుండి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సీన్‌కు అనుమతిచ్చింది కేంద్రం. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు నాలుగు రోజులుగా పైపైకి చేరుకుండటంతో పసిడి సెంటిమెంట్ బలహీనపడింది.

రూ.47,000 దిగువకు పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.370.00 (-0.79%) తగ్గి రూ.370.00 (-0.79%) వద్ద ట్రేడ్ అయింది. రూ.47,245.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,299.00 గరిష్టాన్ని, రూ.46,462.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.353.00 (-0.74%) తగ్గి రూ.47039.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,606.00 వద్ద ప్రారంభమై, రూ.47,606.00 గరిష్టాన్ని, రూ.46,800.00 కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు డౌన్
వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.396.00 (-0.58%) తగ్గి రూ.67390.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,562.00 వద్ద ప్రారంభమై, రూ.68,729.00 గరిష్టాన్ని, రూ.66,971.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.503.00 (-0.73%) తగ్గి రూ.68540.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,600.00 ప్రారంభమైన ధర, రూ.69,932.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,027.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 6.45 (0.36%) డాలర్లు తగ్గి 1,767.45 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,754.85 - 1,789.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. -0.117 (0.45%) డాలర్లు తగ్గి 25.968 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.740 - 26.545 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications