ముంబై: దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు ఐదో రోజు క్షీణించాయి. నిన్న మిడిల్ సెషన్‌లో ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ ఆ తర్వాత క్లోజింగ్ సమయానికి తగ్గాయి. నిన్న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,500కు పైన ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ కూడా అలాగే ముగిసింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.60,000 దిగువ ముగిసింది. మార్చి ఫ్యూచర్స్ రూ.61,000 పైన క్లోజ్ అయింది. బంగారం ధర ఈ వారం ఐదు సెషన్లలో రూ.1700కు పైగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు క్షీణించాయి.

రూ.48,500 దిగువకు బంగారం ధరలు
ఎంసీఎక్స్‌లో శుక్రవారం (నవంబర్ 27) ఉదయం సెషన్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52.00 (-0.11%) తగ్గి రూ.48,465.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,508.00 ప్రారంభమైన ధర, రూ.48,522.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,457.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.66.00 (-0.14%) క్షీణించి రూ.48452.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,502.00 ప్రారంభమై, రూ.48,560.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,442.00 కనిష్టాన్ని తాకింది.
బంగారం ధరలు రూ.48,500 దిగువకు వచ్చాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7700 తక్కువగా ఉంది.

వెండి ధరలు డౌన్
వెండి ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.373.00 (-0.62%) క్షీణించి రూ.59,500.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.59,507.00 వద్ద ప్రారంభమై, రూ.59,658.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,456.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.439.00 (-0.71%) క్షీణించి రూ.61184.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,299.00 వద్ద ప్రారంభమై, రూ.61,363.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,184.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.రూ.59,500 స్థాయికి వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.20వేల వరకు తక్కువ పలుకుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల మధ్య తచ్చాడుతున్నాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ +0.35 (+0.02%)పెరిగి 1,805.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,804.70 - 1,811.50 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,805.50 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 22 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ -0.199 (-0.85%) క్షీణించి 23.160 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 23.145 - 23.330 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 23.362 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 35 శాతం పెరిగింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!



Click it and Unblock the Notifications