Gold prices today: ఈ వారంలో రూ.1300 తగ్గిన పసిడి, వరుసగా ఐదో రోజు
ముంబై: బంగారం ధరలు వరుసగా ఐదో రోజు క్షీణించాయి. నేడు బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.9000 వరకు తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేలు తక్కువగా ఉంది. గతవారం పసిడి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 48,000 క్రాస్ చేసింది. అయితే ఇప్పుడు తిరిగి రూ.47,000 దిగువకు వచ్చాయి. గత వారం రూ.2000కు పైగా పెరిగిన గోల్డ్ ఈ వారం స్వల్పంగా తగ్గాయి. ఈ వారం రూ.1300 వరకు తగ్గాయి.

రూ.47,000 దిగువకు పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ఉదయం సెషన్లో రూ.353.00 (0.75%) తగ్గి రూ.46950.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,150.00 ప్రారంభమైన ధర, రూ.47,273.00 గరిష్టాన్ని, రూ.46,915.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.334.00 (0.70%) తగ్గి రూ.47,246 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,425.00 వద్ద ప్రారంభమై, రూ.47,433.00 గరిష్టాన్ని, రూ.47,235.00 కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు భారీగా డౌన్
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,218.00 (1.77%) తగ్గి రూ.67740.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,680.00 వద్ద ప్రారంభమై, రూ.68,680.00 గరిష్టాన్ని, రూ.67,660.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,188.00 (1.69%) తగ్గి రూ.69012.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,498.00 ప్రారంభమైన ధర, రూ.69,618.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,913.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. -13.05 (0.73%) డాలర్లు తగ్గి 1,765.70 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,765.85 - 1,776.60 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 26 డాలర్ల దిగువకు వచ్చింది. 0.445 (1.68%) డాలర్లు తగ్గి 25.965 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.938 - 26.325 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications