Gold prices today: కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గాయి. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు నెల రోజుల కనిష్టం వద్ద ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రూ.50,000కు అటు ఇటు కదలుతున్న ధరలు నేడు (బుధవారం, జనవరి 27) రూ.49,000 దిగువకు వచ్చాయి. గత ఏడాది ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7,300 వరకు తక్కువగా ఉంది. కరోనా కేసులు, వ్యాక్సీన్, అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్ వ్యాల్యూ వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి.

రూ.49,000 దిగువకు పసిడి
నేడు ఉదయం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 302.00 (-0.61%) తగ్గి రూ.48,841.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,903.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,946.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,807.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 320.00 (-0.65%) తగ్గి రూ.49,011.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,057.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,069.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,990.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి 66,000కు
బంగారం ధరలతో పాటు వెండి ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 369.00 (0.55%) పెరిగి రూ.66166.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,231.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,231.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,045.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. రూ.176.00 (0.26%) తగ్గి రూ.67095.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,029.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,100.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,004.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్లకు దిగువ పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 5.85 (0.32%) డాలర్లు పెరిగి 1,845.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,841.80 - 1,850.40 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.04% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.151 (0.59%) డాలర్లు తగ్గి 25.387 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.275 - 25.545 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 39.69శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications