బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గాయి. ఈ రోజు(ఆగస్ట్ 24, సోమవారం) ఉదయం ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10గ్రాములు 0.3శాతం క్షీణించి రూ.51,865 పలికింది. ఈ నాలుగు రోజుల్లోనే పసిడి రూ.1700 తగ్గింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు 1 శాతం మేర క్షీణించి కిలో రూ.66,430 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం 0.3 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ 1 శాతం తగ్గింది. ఆగస్ట్ 7వ తేదీన గరిష్టానికి చేరుకున్న ధరతో పోలిస్తే 10 గ్రాములు దాదాపు రూ.4,500 వరకు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇన్వెస్టర్స్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమా పోవెల్ నిర్ణయ ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి ఔన్స్ 1,933.37 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం క్షీణించి 1,910.10 డాలర్లకు పడిపోయింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.6 శాతం క్షీణించి ఔన్స్ 26.54 డాలర్లు, ప్లాటినమ్ 0.5 శాతం పడిపోయి 913.78 డాలర్లు పలికింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.400 వరకు పడిపోయింది. అయినప్పటికీరూ.55 వేలకు పైన ఉంది. 22 క్యారెట్ల పసిడి కూడా దాదాపు అంతే క్షీణించింది. రూ.50,500 వరకు పలికింది.
More From GoodReturns

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం కొనాలా..వెండి కొనాలా.. ఇరాన్ యుద్ధంతో ఇన్వెస్టర్లు ఆందోళన..నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

Gold Silver: ఆ గ్లోబల్ రిపోర్ట్ చెప్పినట్లుగా బంగారం రేటు ఆకాశాన్ని తాకబోతోందా?

బంగారం ధరలపై దిమ్మతిరిగే న్యూస్.. పసిడి ధర భారీగా పెరగడానికి ఈ మూడే కారణం.. భవిష్యత్తులో కూడా..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

బంగారాన్ని భారీగా కొంటున్న బ్యాంకులు.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులన్నీ అమ్మేసి మరీ.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications