Gold prices today: భారీగా పెరిగిన బంగారం ధర, 64,000 దిగువకు వెండి
నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు పెరిగాయి. నిన్నటి వరకు పసిడి ధరలు వరుసగా నాలుగో రోజు క్షీణించి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12000కు పైగా తగ్గాయి. తద్వారా దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.44,000 దిగువకు వచ్చింది. నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు మరింత క్షీణించి రూ.64,000 దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు క్షీణించాయి. ఆల్ టైమ్ గరిష్టం 2072తో పసిడి 370 డాలర్లు తక్కువగా ఉంది. నాలుగు రోజుల పాటు తగ్గిన పసిడి ధర నేడు మాత్రం పెరిగింది.

రూ.500 పెరిగిన బంగారం
గోల్డ్ ఫ్యూచర్ నేడు (మార్చి 30, 2021) ఉదయం సెషన్‌లో పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.467.00 (1.07%) పెరిగి రూ.44,012.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,669.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,159.00 వద్ద గరిష్టాన్ని, రూ.43,669.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,200 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.218.00 (-0.49%) తగ్గి రూ.44480.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,590.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,591.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,108.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.450 తగ్గిన వెండి ధర
వెండి ధరలు నేడు ఉదయం సెషన్లో రూ.500 వరకు తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.429.00 (0.67%) తగ్గి రూ.63745.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,976.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,056.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,629.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.461.00 (-0.71%) తగ్గి రూ.64655.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,881.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,942.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,623.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1700 డాలర్ల సమీపానికి బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. కామెక్స్‌లో 8.30 (-0.48%) డాలర్లు తగ్గి 1,706.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,703.60 - 1,714.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిగువనే ఉంది. ఔన్స్ ధర 0.073 (-0.29%) డాలర్లు తగ్గి 24.695 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.543 - 24.750 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications