వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధరలు, వెండి కూడా అదే దారి
బంగారం ధరలు వరుసగా మూడో రోజు క్షీణించాయి. నేడు (శుక్రవారం, మే 28) గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,500 దిగువకు వచ్చింది. ఓసమయంలో రూ.49,000ను దాటి రూ.50వేల దిశగా పరుగెట్టేలా కనిపించిన పసిడి మూడ్రోజులుగా క్షీణిస్తోంది. రూ.73వేలు దాటిన వెండి కూడా ప్రస్తుతం రూ.71,000 వద్ద ఉంది. ఈ వారంలో భారీగా ఎగిసి, అంతేస్థాయిలో పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఓ సమయంలో 1900 డాలర్లు దాటిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఆ దిగువన ట్రేడ్ అవుతోంది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7800 తక్కువగా ఉంది.

మళ్లీ తగ్గిన పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.139.00 (0.29%) తగ్గి రూ.48442.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,432.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,497.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,270.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.191.00 (0.39%) క్షీణించి రూ.48975.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49060.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,060.00 గరిష్టాన్ని, రూ.48,843.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,500 దిగువన వెండి
వెండి ఫ్యూచర్ ధరలు సాయంత్రానికి స్వల్పంగా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.548.00 (0.76%) తగ్గి రూ.71171.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,460.00 వద్ద ప్రారంభమై, రూ.71,476.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,967.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.464.00 (-0.64%) తగ్గి రూ.72384.00 వద్ద ట్రేడ్ అయింది. 72,601.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,601.00 గరిష్టాన్ని, రూ.72,190.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గాయి. 1900 డాలర్ల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 2.50
(0.13%) డాలర్లు తగ్గి 1,893.20 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,888.00 - 1,897.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.152 (0.54%) డాలర్లు తగ్గి 27.788 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.692 - 28.012 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications