నేడు (శుక్రవారం, జూలై 3) బంగారం ధరలు తగ్గాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్(MCX)లో 10 గ్రాముల బంగారం ధర 0.2 శాతం తగ్గి రూ.48,171 పలికింది. కిలో వెండి ధర 0.48 శాతం పడిపోయి రూ.49,187 పలికింది. ఈ వారంలోనే ఎంసీఎక్స్‌లో బంగారం రికార్డ్ ధర రూ.48,982కు చేరుకుంది. అయితే అది ఎంతోసేపు నిలవలేదు.

బంగారం ధర తగ్గడానికి కారణాలు
కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తుందనే అనుమానాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ పెరగడం, రూపాయి క్రమంగా బలపడటం తదితర కారణాలు ధరలపై ఒత్తిడిని పెంచాయి. దీంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతేకాదు, అమెరికాలో నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గుతుందనే డేటా వెల్లడిస్తోంది. అయితే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, భారత్-చైనా సరిహద్దుల్లో టెన్షన్స్ వంటి వివిధ కారణాలు బంగారంకు మద్దతుగా నిలవడంతో స్వల్పంగా మాత్రమే తగ్గాయి. ఈ ఏడాది బంగారం ధరలు 25 శాతానికి పైగా పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్స్ స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి 1,773.13 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి 1,785.60 డాలర్లు పలికింది. బుధవారం బంగారం ధరలు ఎనిమిదేళ్ల గరిష్టం 1,788.96 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ ఔన్స్ 0.1 శాతం పెరిగి 803.91, వెండి స్థిరంగా 17.90 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ SPDR గోల్డ్ ట్రస్ట్ వద్ద నిల్వలు గురువారం నాటికి 0.8 శాతం పెరిగి 1,191.47 టన్నులకు చేరుకున్నాయి.

హైదరాబాద్ సహా నగరాల్లో
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,340గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం రూ.50,950గా ఉంది. కోల్‌కతాలో రూ.47,520, రూ.48,810, బెంగళూరులో రూ.45,680, రూ.49,830, చెన్నైలో రూ.46,340, రూ.50,950, ముంబైలో రూ.46,550, రూ.47,550, ఢిల్లీలో రూ.47,160, రూ.48,360గా ఉన్నాయి.

ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంటే..
కరోనా ప్రభావం డైలమా ఇన్వెస్టర్లను కూడా గందరగోళపరుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు క్రమంగా లాభాల్లోకి వచ్చాయి. రోజు రోజుకు లాభాలు నమోదు చేస్తున్నాయి. ఆ పరిస్థితి ఉంటే బంగారం ధరల్లో పెరుగుదల ఇక భారీగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. ఈక్విటీ మార్కెట్ మళ్లీ దెబ్బతింటే మాత్రం బంగారానికి అనూహ్యంగా పుంజుకుంటుందని చెబుతున్నారు. కానీ మార్కెట్లు ఇప్పుడు సానుకూలంగా సాగుతున్నాయి. కాబట్టి దాదాపు స్థిరంగా ఉండే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. కరోనా రెండోసారి విజృంభణ, దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం ఇన్వెస్టర్లు ఇప్పటి కంటే బంగారం వైపు ఎక్కువగా చూసే అవకాశముంటుందని అంటున్నారు. అప్పుడు పెరుగుదల మరింత వేగంగా ఉండవచ్చు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications