బంగారం ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. అయినప్పటికీ ఫ్యూచర్ గోల్డ్ రూ.46,000కు పైనే ఉంది. వెండి ధరలు భారీగానే క్షీణించాయి. దాదాపు రూ.800 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల దిగువకు వచ్చింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిగువకు పడిపోయింది. గత వారం పసిడి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. అయితే నేడు స్వల్పంగా క్షీణించాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి రూ.56,200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9,800 తక్కువగా ఉంది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46వేలను క్రాస్ చేసింది. నేడు అక్కడే తచ్చాడుతోంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్‌లో రూ.143.00 (-0.31%) తగ్గి రూ.46,450.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,545.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,777.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,400.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.117.00 (-0.25%) తగ్గి రూ.46663.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,825.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,700.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,640.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.786 తగ్గిన వెండి
వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.786.00 (-1.17%) క్షీణించి రూ.66197.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,786.00 వద్ద ప్రారంభమై, రూ.67,293.00 గరిష్టాన్ని, రూ.65,961.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.952.00 (-1.40%) తగ్గి రూ.67100.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,993.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,292.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,914.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడా తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు తగ్గాయి. 1730 డాలర్ల వద్దకు వచ్చింది. 12.30 (-0.70%) డాలర్లు పెరిగి 1,732.50 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,730.25 - 1,745.30 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.497 (1.96%) డాలర్లు తగ్గి 24.828 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.738 - 25.328 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications