For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 రోజుల్లో రూ.550కి పైగా తగ్గిన బంగారం ధర, పడి'లేచిన' వెండి

|

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు గురువారం స్వల్పంగా క్షీణించగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంత్రం గం.9.30 సమయానికి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.117 (0.23 శాతం) తగ్గి రూ.50,378 పలికింది. రూ.50,446 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,617 వద్ద గరిష్టాన్ని, రూ.50,070 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం రెండు రోజుల్లో రూ.550కి పైగా తగ్గింది. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికిన విషయం తెలిసిందే. ఈ ధరతో దాదాపు రూ.5,900 తక్కువ పలికింది.

<br><strong>ధరలకు అలవాటు పడాలి.. బంగారంపై కరోనా భారీ దెబ్బ</strong>
ధరలకు అలవాటు పడాలి.. బంగారంపై కరోనా భారీ దెబ్బ

రూ.100కు పైగా తగ్గిన పసిడి

రూ.100కు పైగా తగ్గిన పసిడి

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.100కు పైగా క్షీణించగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.133 (0.26 శాతం) క్షీణించి రూ.50,461 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,545 వద్ద ప్రారంభమైన పసిడి, రూ.50,701 వద్ద గరిష్టాన్ని, రూ.50,205 వద్ద కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,900 నుండి రూ.49,700 స్థాయికి చేరుకోవచ్చునని, నిరోధకస్థాయి రూ.50,550 నుండి రూ.50,700 మధ్య ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

వెండి ఫ్యూచర్స్ స్వల్ప పెరుగుదల

వెండి ఫ్యూచర్స్ స్వల్ప పెరుగుదల

బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు కాస్త పెరిగాయి. కిలో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.68 (0.11 శాతం) పెరిగి రూ.60,206 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం రూ.60,069 వద్ద ప్రారంభం కాగా, రూ.60,735 వద్ద గరిష్టాన్ని, రూ.58,381 వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే ఓ సమయంలో రూ.2వేలకు పైగా క్షీణించింది. ఆ తర్వాత కోలుకుంది.

మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.67 (0.11 శాతం) పెరిగి రూ.61,824 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,790 వద్ద ప్రారంభం కాగా, రూ.62,122 వద్ద గరిష్టాన్ని, రూ.60,099 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇది కూడా ఓ దశలో రూ.2వేల వరకు క్షీణించింది. తర్వాత మళ్లీ పెరిగింది.

పసిడి డౌన్, వెండి అప్

పసిడి డౌన్, వెండి అప్

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గింది. ఔన్స్ పసిడి 0.55 శాతం క్షీణించి 1,869 డాలర్లు పలికింది. 1,859.45 - 1,885.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,879.20 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో పసిడి 23.50 శాతం పెరిగింది.వెండి ఔన్స్ 0.20 శాతం పెరిగి 23.415 డాలర్లు పలికింది. 22.625 - 23.640 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 23.359 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది వెండి ధరలు 29 శాతం పెరిగాయి.

English summary

2 రోజుల్లో రూ.550కి పైగా తగ్గిన బంగారం ధర, పడి'లేచిన' వెండి | Gold prices today fall, down Rs 5900 from record highs

In the futures market, gold touched an intraday high of Rs 50,617 and a low of Rs 50,280 on the MCX.
Story first published: Thursday, October 29, 2020, 22:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X