ముంబై: బంగారం, వెండి ధరలు మంగళవారం (అక్టోబర్ 20) క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఈ ప్రభావం దేశీయ ఫ్యూచర్ మార్కెట్లపై కనిపించింది. ప్రారంభ సెషన్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ రూ.98 (0.19 శాతం) క్షీణించి రూ.50,589 పలికింది. రూ.50,600 వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా, రూ.50,626 వద్ద గరిష్టాన్ని, రూ.50,525 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి ధర రూ.5,500 తక్కువ పలుకుతోంది.

బంగారం ధరలో క్షీణత.. అదే దారిలో వెండి
గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్ రూ.124 (0.24 శాతం) క్షీణించి రూ.50,626 పలికింది. రూ.50,638 వద్ద ప్రారంభం కాగా, రూ.50,643 వద్ద గరిష్టాన్ని, రూ.50,620 వద్ద కనిష్టాన్ని తాకింది.
వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. ప్రారంభ సెషన్‌లో కిలో డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.55 (0.09 శాతం) క్షీణించి రూ.62,040 పలికింది. రూ.62,050 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,150 వద్ద గరిష్టాన్ని, రూ.61,792 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.98 (0.15శాతం) క్షీణించి కిలో రూ.63,600 పలికింది. రూ.63,500 వద్ద ప్రారంభమైన ధర రూ.63,600 వద్ద గరిష్టం వద్ద కొనసాగుతోంది. ప్రారంభ ధరనే కనిష్టం.

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 0.41 శాతం పడిపోయి ఔన్స్ ధర 1,903.90 డాలర్లు పలికింది. 1,896.95 - 1,907.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో1911.70 డాలర్ల వద్ద ముగిసింది.
స్పాట్ గోల్డ్ 1903 డాలర్లు పలికింది.
ఇక వెండి ఫ్యూచర్స్ 0.56 శాతం క్షీణించి ఔన్స్ 24.560 డాలర్లు పలికింది. 24.410 - 24.657 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.698 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ప్లాటినమ్, పల్లాడియం ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

ఆర్థిక ప్యాకేజీపై మరింత స్పష్టత కోసం..
అమెరికా ఆర్థిక ప్యాకేజీపై మరింత స్పష్టత కోసం బంగారం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. దీంతో దాదాపు నిలకడగా ఉంది. 1900 డాలర్లకు అటు ఇటుగా తచ్చాడుతోంది. పరిస్థితులు ఇలాగే సాధారణంగా కొనసాగితే ఈ వారం పసిడి ధరలు 1930 డాలర్ల నుండి 1880 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బులియన్ మార్కెట్లో..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి రూ.51,730 పలికింది. జీఎస్టీ ఉంటుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,100 పలికింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 53,780, 22 క్యారెట్లు రూ.49,300 పలికింది.
More From GoodReturns

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications