రూ.45,000 దిగువకు బంగారం, రూ.1200 తగ్గిన వెండి ధర
ముంబై: బంగారం ధరలు నేడు (సోమవారం, మార్చి 22) స్వల్పంగా క్షీణించాయి. ఫ్యూచర్ మార్కెట్లో కీలకమైన రూ.45,000 దిగువకు పడిపోయాయి. గత కొంతకాలంగా పసిడి ధరలు రూ.45వేలకు దిగువనే కదలాడుతున్నాయి. చివరి సెషన్లో అతి స్వల్పంగా పెరిగి రూ.45,000 కాస్త పైన ముగిసింది. ఇప్పుడు ఆ కీలకస్థాయి కిందకు పడిపోయింది. నేడు బంగారం స్వల్పంగా క్షీణించగా, వెండి మాత్రం దాదాపు 2 శాతం మేర పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి స్వల్పంగా తగ్గగా, వెండి 26 డాలర్ల దిగువకు వచ్చింది.

రూ.45వేల దిగువకు పసిడి
గోల్డ్ ఫ్యూచర్ నేడు సాయంత్రం సెషన్‌లో స్వల్పంగా క్షీణించాయి. ప్రారంభంలో రూ.400 వరకు క్షీణించినప్పటికీ ఆ తర్వాత కాస్త కుదురుకుంది. అయినప్పటికీ కీలకమైన రూ.45వేలకు దిగువనే ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.133.00 (-0.30%) క్షీణించి రూ.44888.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,974.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,040.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,630.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,400 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.124.00 (-0.27%) క్షీణించి రూ.45200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,296.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,344.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,945.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1200 డౌన్
వెండి ధరలు భారీగా తగ్గాయి. దీంతో రూ.67,000 దిగువకు వచ్చింది. ఓ సమయంలో రూ.65వేల స్థాయికి దిగి వచ్చింది.మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,234.00 (1.83%) తగ్గి రూ.66293.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,710.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.1,176.00 (-1.72%) తగ్గి రూ.67340.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,016.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,016.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,815.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.85 (-0.22%) డాలర్లు తగ్గి 1,737.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,726.50 - 1,746.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువకు చేరుకుంది. ఔన్స్ ధర 0.524 (1.99%) డాలర్లు తగ్గి 25.797 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.453 - 26.312 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications