బంగారం ధరలు నేడు(ఏప్రిల్ 26, సోమవారం) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం వారం రూ.48,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,500 దిగువన ట్రేడ అవుతోంది. తద్వారా గత మూడు సెషన్‌లలో పసిడి ఏకంగా రూ.1000 వరకు క్షీణించింది. సిల్వర్ ఫ్యూచర్స్ గత వారం ఓ సమయంలో రూ.70,000ను తాకింది. ఇప్పుడు రూ.68,500 దిగువన ట్రేడ్ అవుతోంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8700 తక్కువగా ఉండగా, వెండి రూ.11,000 వరకు తక్కువగా ఉంది.

రూ.47,500 దిగువన పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.37.00 (-0.08%) తగ్గి రూ.47495.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,604.00 ప్రారంభమైన ధర, రూ.47,650.00 గరిష్టాన్ని, రూ.47,370.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45.00 (-0.09%) తగ్గి రూ.47788.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,911.00 ప్రారంభమైన ధర, రూ.47,919.00 గరిష్టాన్ని, రూ.47,691.00 కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప తగ్గుదల
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.213.00 (-0.31%) తగ్గి రూ.68461.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,086.00 వద్ద ప్రారంభమై, రూ.69,437.00 గరిష్టాన్ని, రూ.68,055.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.185.00 (-0.26%) తగ్గి రూ.69649.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,944.00 ప్రారంభమైన ధర, రూ.70,095.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,215.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. +3.25 (+0.18%) డాలర్లు తగ్గి 1,781.00 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,773.65 - 1,783.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 26 డాలర్లకు పైనే ఉంది. +0.058 (+0.22%) డాలర్లు తగ్గి 26.133 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.905 - 26.177 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications