ముంబై: బంగారం ధరలు నేడు (మార్చి 3, బుధవారం) స్థిరంగా ఉన్నాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.10,700 వరకు తక్కువగా ఉంది. క్రితం సెషన్లో దాదాపు రూ.200 వరకు పెరిగింది. వెండి ధరలు పెరిగాయి. రూ.68,000 స్థాయికి వచ్చాయి. బంగారం ధరలు ప్రస్తుతం పది నెలల కనిష్టం వద్ద కదలాడుతున్నాయి. బంగారం ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అయినప్పటికీ ఒత్తిడిలోనే కొనసాగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

రూ.45,544 వద్ద బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (బుధవారం, మార్చి 3) ప్రారంభ సెషన్లో రూ.45,500 స్థాయిలో ఉన్నాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.4.00 (0.01%) తగ్గి రూ.45,544.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,524.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,544.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,481.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,700 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.96.00 (0.21%) తగ్గ రూ.45,653 వద్ద ట్రేడ్ అయింది. 45,700.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,700.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,653.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.68వేల వద్ద వెండి ధరలు
వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.636.00 (0.94%) పెరిగి రూ.67,975.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,035.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,113.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,950.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.139.00 (0.20%) తగ్గి రూ.69076.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,216.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,332.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,070.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నేడు తగ్గిన బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు తగ్గాయి. 1740 డాలర్ల దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.55 (-0.03%) డాలర్లు తగ్గి 1733.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,728.70 - 1,738.90 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 7.66 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 27 డాలర్ల దిగువన ఉంది. ఔన్స్ ధర 0.114 (0.42%) డాలర్లు తగ్గి 26.765 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.715 - 26.913 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications