బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. అయితే నేడు (ఫిబ్రవరి 8, సోమవారం) అతి స్వల్పంగా పెరిగాయి. బడ్జెట్ ప్రకటన అనంతరం పసిడి ధరలు భారీగా క్షీణించాయి. రూ.2000కు పైగా తగ్గాయి. ఓ సమయంలో రూ.47,000 దిగువకు వచ్చాయి. అయితే గతవారం చివరి సెషన్లో రూ.47,000 దాటాయి. నేడు ప్రారంభ సెషన్లో కూడా పడిపోయిన ధరలు, ఆ తర్వాత స్వల్పంగా పెరిగాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో చూస్తే రూ.9000 తక్కువగా ఉన్నాయి.
బంగారం ధరలు ఈవారం కూడా కాస్త పైకి చేరే అవకాశాలు లేకపోలేదని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు రూ.45,000 స్థాయికి పడిపోయే అవకాశాలు కొట్టిపారేయలేమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

స్వల్పంగా పెరుగుదల
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (సోమవారం, ఫిబ్రవరి 8వ తేదీ) ఉదయం 96.00 (0.20%) పెరిగి రూ.47,352.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,352.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,387.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,152.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.136.00 (0.29%) పెరిగి రూ.47,257 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,257.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,497.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,257.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి కూడా...
వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 218.00 (0.32%) పెరిగి రూ.68956.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,700.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,032.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,420.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.229.00 (0.33%) పెరిగి రూ.70030.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,597.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,080.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,496.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గినప్పటికీ, నేడు మళ్లీ పెరిగి 1800 డాలర్ల పైనే కదలాడుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1.85 (0.10%) డాలర్లు పెరిగి 1814.84 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,808.35 - 1,819.50 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 13.77% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.188 (0.70%) డాలర్లు పెరిగి 27.190 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.933 - 27.390 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 52.264 శాతం పెరిగింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications