Gold prices today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? ఆ ధరతో రూ.8500 తక్కువ
బంగారం ధరలు నేడు (గురువారం, ఫిబ్రవరి 11) అతి స్వల్పంగా తగ్గాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పది గ్రాముల పసిడి రూ.48,000 దిగువకు వచ్చింది. పసిడి ధరలు వరుసగా నాలుగైదు సెషన్లుగా పెరుగుతున్నాయి. నేడు మాత్రం క్షీణించాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8500 తక్కువగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.50,960 వద్ద ఉంది. హైదరాబాద్‌లో రూ.48,600కు చేరుకుంది.

రూ.48,000 దిగువకు పసిడి
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.225.00 (-0.47%) తగ్గి రూ.47,788.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,837.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,100.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,727.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8400కు పైగా తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.80.00 (-0.17%) తగ్గి రూ.48,055 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,020.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,240.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,900.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.69,000 దిగువకు వెండి
నేడు ప్రారంభ సెషన్లో సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గినప్పటికీ, సాయంత్రం సెషన్‌కు అతి స్వల్పంగా పెరిగింది. వెండి రూ.69వేల దిగువకు వచ్చింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.29.00 (0.04%) పెరిగి రూ.68,955.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,270.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,189.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.21.00 (0.03%) పెరిగి రూ.70,012.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,289.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,309.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,289.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1840 దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. 1840 డాలర్ల దిగువకు వచ్చింది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 5.20 (-0.28%) డాలర్లు తగ్గి 1837.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,835.55 - 1,848.30 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.73 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.162 (0.60%) డాలర్లు తగ్గి 27.240 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.750 - 27.345 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 52.08 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications