బంగారం, వెండి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. గత మూడు వారాలుగా ధరలు క్షీణిస్తున్నాయి. నిన్న భారీగా పడిపోయిన ధరలు, నేడు ప్రారంభ సెషన్లోను అదే బాట పట్టాయి. మంగళవారం రాత్రి దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.905.00 (-1.83%) క్షీణించి రూ.48,575.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.942.00 (-1.90%) తగ్గి రూ.48,523.00 వద్ద ముగిసింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.79,5.00 (-1.31%) తగ్గి రూ.59,730.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.842.00 (1.35%) పడిపోయి రూ.61,517.00 వద్ద క్లోజ్ అయింది.

మూడు రోజుల్లో రూ.1800 తగ్గుదల
ఎంసీఎక్స్‌లో నేడు (బుధవారం, 25, నవంబర్) ప్రారంభ సెషన్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.168.00 (-0.35%) క్షీణించి రూ.48,417.00 వద్ద పలికింది. రూ.48,497.00 వద్ద ప్రారంభమై, రూ.48,516.00 గరిష్టాన్ని తాకి, రూ.48,409.00 కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి వెండి ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.123.00 (-0.25%) తగ్గి రూ.48,400.00 పలికింది. రూ.48,455.00 వద్ద ప్రారంభమై, రూ.48,470.00 గరిష్టాన్ని తాకి, రూ.48,398.00 కనిష్టాన్ని తాకింది.
ఈ మూడు రోజుల్లో పసిడి ధరలు రూ.1800కు పైగా తగ్గాయి. పసిడి ధరలు రూ.48,500 దిగువకు చేరుకొని, కొనుగోలుదారులకు భారీ ఊరటను కల్పించాయి. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే దాదాపు రూ.8,000 వరకు తక్కువగా ఉంది. ఇటీవల రూ.52,000ను దాటగా, నాటి నుండి రూ.3500 వేలు తగ్గింది.

రూ.4వేలకు పైగా డౌన్
వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.-191.00 (-0.32%) తగ్గి రూ.59430.00 వద్ద పలికింది. రూ.59,617.00 ప్రారంభమైన ధర, రూ.59,617.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,400.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.245.00 (-0.40%) పడిపోయి రూ.61188.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,278.00 వద్ద ప్రారంభమై, రూ.61,322.00 గరిష్టాన్ని, రూ.61,165.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
వెండి ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో రూ.20వేల వరకు తక్కువగా ఉంది. గత వారం రోజుల్లో రూ.64వేల నుండి రూ.59వేలకు దిగి రావడం ద్వారా రూ.4వేలకు పైగా తగ్గింది.

1800 డాలర్లకు దిగివచ్చిన పసిడి
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు మరింత క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 4.10 (-0.23%) డాలర్లు క్షీణించి రూ.1,800.50 వద్ద ట్రేడ్ అయింది. 1,798.65 - 1,809.55 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో పసిడి 1,804.60 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో పసిడి 21 శాతానికి పైగా తగ్గింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.053 (-0.23%) క్షీణించి 23.247 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 23.195 - 23.415 డాలర్ల మధ్య ట్రేడ్ అయిన వెండి క్రితం సెషన్లో 23.300 వద్ద ముగిసింది. ఏడాదిలో 35 శాతం పెరిగింది.
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..



Click it and Unblock the Notifications