గతవారం భారీగా షాకిచ్చిన బంగారం ధరలు ఈ వారం మాత్రం భారీ ఊరటను ఇచ్చాయి. గతవారం మిడిల్ వరకు రూ.47,000 వద్ద ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,000 సమీపానికి చేరువైంది. అయితే ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. దీంతో కేవలం గత వారం రోజుల్లో రూ.2000 వరకు తగ్గింది. నిన్న ఒక్కరోజు రూ.500కు పైగా క్షీణించింది. దేశీయ రిటైల్ మార్కెట్లో పలుచోట్ల నిన్న ఒక్కరోజు రూ.50,500 నుండి రూ.49,500కు పడిపోయింది. అంతర్జాతీయంగా బంగారానికి ప్రతికూల సంకేతాలు ఉన్నాయి.
దీంతో ఈ ధరలు తగ్గుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 1805 డాలర్లుగా ఉంది. ఫ్యూచర్ గోల్డ్ గతవారం ఓ సమయంలో 1900 డాలర్లకు చేరువైంది. కానీ ఇప్పుడు 1800 డాలర్ల దిగువకు వచ్చింది. క్రితం సెషన్లో 1783 డాలర్ల వద్ద క్లోజ్ అయినప్పటికీ నేడు కాస్త పెరిగి 1794 డాలర్లకు వచ్చింది. గత రెండు సెషన్లలో భారీగా తగ్గిన పసిడి, ఈ సెషన్లో పెరిగింది.

బంగారం రూ.500, వెండి రూ.2000 డౌన్
ఎంసీఎక్స్‌లో పది గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.507.00 (-1.06%) తగ్గి రూ.47416.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.473.00 (-0.98%) క్షీణించి రూ.47720.00 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్లో 1,783.80 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేటి ప్రారంభ సెషన్లో 10.20 (+0.57%) డాలర్లు తగ్గి 1,793.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఏడాదిలో 3.41 శాతం క్షీణించింది.
సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ క్రితం సెషన్‌లో ఏకంగా 1,990.00 (3.08%) డాలర్లు తగ్గి రూ.62581.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,045.00 (3.12%) తగ్గి రూ.63599.00 వద్ద ముగిసింది. నిన్న ఒక్కరోజే వెండి రూ.2000 వరకు తగ్గింది.

వంద డాలర్లు పెరిగి.. అంతే తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గి 1800 డాలర్ల దిగువకు వచ్చింది. ఇటీవలే పద్దెనిమిది నెలల గరిష్టానికి చేరుకుంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఊహించిన దాని కంటే ముందే వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో పసిడి క్షీణించింది. ఇప్పటికే ఫెడ్ రిజర్వ్ చైర్మన్‌గా జెరోమ్ పోవెల్‌ను పునర్నియమించారు. దీంతో స్పాట్ గోల్డ్ ఓ సమయంలో 1797 డాలర్లకు వచ్చింది.
కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నవంబర్ ప్రారంభంలో 100 డాలర్లకు పైగా పెరిగి 1880 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు దాదాపు అదే స్థాయిలో పెరిగాయి.

కారణాలు
రెండు మూడు రోజుల క్రితం వరకు బంగారం ర్యాలీ చేసిందని, ద్రవ్యోల్భణం పెరుగుదల భయాలతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయని చెబుతున్నారు. ప్రధానంగా జెరోమ్ పోవెల్‌కు రెండోసారి అవకాశం ఇవ్వడంతో వడ్డీ రేట్లు త్వరలోనే పెరిగే అవకాశముందనే అంచనాలతో బంగారం ధరలు క్షీణిస్తున్నాయని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications