బంగారం ధరలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పడిపోయాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.12,000 తక్కువగా ఉంది. పసిడి ధరలు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఏకంగా రూ.44,000 స్థాయికి దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోను 1700 డాలర్ల దిగువకు పడిపోయింది. వెండి ధరలు మాత్రం దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గాయి. ఇటీవల పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతోన్న విషయం తెలిసిందే.

రూ.12 వేలు తక్కువ
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (సోమవారం, మార్చి 8) సాయంత్రం సెషన్లో రూ.44,202 స్థాయికి దిగి వచ్చింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.481.00 (-1.08%) తగ్గి రూ.44,202.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,756.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,780.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,150.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.441.00 (-0.98%) తగ్గి రూ.44425.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,903.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,964.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,400.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.65,500 పైకి
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.149.00 (0.23%) పెరిగి రూ.65752.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,455.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,633.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,247.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.177.00 (0.27%) పెరిగి రూ.66733.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,571.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,595.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,359.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1700 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. 1700 డాలర్ల దిగువకు వచ్చాయి. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 21.55 (-1.27%) డాలర్లు తగ్గి 1676.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,675.60 - 1,711.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల స్థాయికి వచ్చింది. ఔన్స్ ధర 0.110 (-0.44%) డాలర్లు తగ్గి 25.177 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.975 - 25.960 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పతనం.. ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..

భవిష్యత్తులో బంగారం అయిపోతుందా.. మైనింగ్ తవ్వకం తరువాత ఏమి మిగలదా..పసిడి కొరతపై క్లారిటీ ఇదిగో..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే.. మార్చి 12, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..



Click it and Unblock the Notifications