For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధర, రూ.వేలల్లో తగ్గిన వెండి ధర

|

ముంబై: బంగారం, వెండి ధరలు ఈరోజు(సెప్టెంబర్ 22) ప్రారంభ సెషన్ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. నిన్న భారీగా పడిపోయిన ధరలు, ఈ రోజు ప్రారంభంలో స్వల్పంగా లాభపడ్డాయి. అయితే అంతలోనే అంతకంటే ఎక్కువగా పడిపోయాయి. సాయంత్రం సెషన్ సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ఫ్యూచర్స్ ధరలు 0.14 శాతానికి క్షీణించి 10 గ్రాములు రూ.50,300 పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.5 శాతం తగ్గి కిలో రూ.61,011కు పడిపోయింది. అంతకుముందు సెషన్‌లో బంగారం ధరలు 2.4 శాతం (రూ.1200) క్షీణించింది. వెండి కిలో రూ.9.3 శాతం లేదా రూ.6300 తగ్గింది..

దీపావళి నాటికి బంగారం ధరలు షాకిస్తాయా? ఎంత పెరగొచ్చు, ఎందుకు?దీపావళి నాటికి బంగారం ధరలు షాకిస్తాయా? ఎంత పెరగొచ్చు, ఎందుకు?

రూ.600కు పైగా తగ్గిన బంగారం, రూ.5,700 తగ్గిన వెండి

రూ.600కు పైగా తగ్గిన బంగారం, రూ.5,700 తగ్గిన వెండి

ఎంసీఎక్స్‌లో ఉదయం 10 గ్రాములు రూ.100కు పైగా రూ.50,600 పైకి చేరుకున్నాయి. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.500కు పైగా పెరిగింది. అయితే సాయంత్రం సెషన్‌కు ధరలు తగ్గాయి. గత సెషన్‌లో కంటే పసిడి రూ.600కు పైగా తగ్గింది. బలహీన అంతర్జాతీయ పరిణామాలు బంగారం తగ్గుదలకు కారణమయ్యాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి కిలో రూ.5,700కు పైగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలో తగ్గుదల ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్లకు..

అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్లకు..

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర భారీగా తగ్గింది. స్పాట్ గోల్డ్ 0.4 శాతం పడిపోయి ఔన్స్ 1,904.21 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్‌లో (సోమవారం) 3 శాతం పడిపోయింది. వెండి 2.2 శాతం పడిపోయి ఔన్స్ 24.19 డాలర్లకు పడిపోయింది. ప్లాటినమ్ 0.3 శాతం లాభపడి 883.85 డాలర్లు, పల్లాడియం 0.2 శాతం క్షీణించి 2,269.81 డాలర్లకు తగ్గింది. సిక్స్ కరెన్సీ బంగారంతో పోలిస్తే డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో యూరోప్, యూకేలలో రెండోసారి కరోనా విజృంభిస్తుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఫ్యూచర్స్.. టర్నోవర్

ఫ్యూచర్స్.. టర్నోవర్

సాయంత్రం సెషన్‌లో గోల్డ్ అక్టోబర్ డెలివరీ రూ.160కి పైగా తగ్గి 10 గ్రాములు రూ.50,308 పలికింది. బిజినెస్ టర్నోవర్ 8,022 లాట్లుగా ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.170 తగ్గి రూ.50,470 పలికింది. టర్నోవర్ 10,129 లాట్లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ వ్యాల్యూ వరుసగా రూ.3,180.25 కోట్లు, రూ.389.51 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ కాంట్రాక్ట్ అక్టోబర్ రూ.130కి పైగా తగ్గి రూ.50,375 పలకగా, బిజినెస్ టర్నోవర్ 12,447 లాట్లుగా ఉంది.

English summary

గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధర, రూ.వేలల్లో తగ్గిన వెండి ధర | Gold prices today fall again after slumping Rs 1,200 previous day, silver drops

Gold and silver prices in India today gave up early gains to move lower, extending the previous session's sharp fall. On MCX, gold futures fell 0.14% to ₹50,400 per 10 gram while silver futures declined 0.5% to ₹61,011 per kg.
Story first published: Tuesday, September 22, 2020, 23:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X